
ప్రారంభం నుంచి కమర్షియల్ సినిమాలు చేస్తూ స్టార్‌గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan) టాలీవుడ్‌లో సరికొత్త మాస్ జాతర స్టార్ట్ చేశారు. డీ గ్లామర్ లుక్‌లో సాహసం చేసి `రా` ఫిల్మ్ `రంగస్థలం` (Rangasthalam) చేశాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. 2018లో విడుదలైన ఈ సినిమా అప్పటి వరకు ఉన్న నాన్ `బాహుబలి` రికార్డ్ లను బద్దలు కొట్టింది. రామ్‌చరణ్‌ని నటుడిగా సరికొత్తగా ఆవిష్కరించింది. సుకుమార్ దర్శకత్వంలోని అసలైన స్టఫ్ బయటపెట్టింది. చరణ్ సైతం ఒక మాస్, డీ గ్లామర్, రా ఫిల్మ్ జోనర్‌కి పునాది వేశాడు. ఇలాంటి సినిమాలు చేయొచ్చనే ధైర్యాన్నిచ్చాడు.
మళ్లీ అలాంటి రా ఫిల్మ్ కూడా సుకుమార్ దర్శకత్వంలోనే రావడం విశేషం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)తో మరింత రా, రస్టిక్ మూవీ `పుష్ప`(Pushpa) చేశాడు సుకుమార్. బన్నీని సరికొత్తగా ఆవిష్కరించిన `పుష్ప` గతేడాది డిసెంబర్‌లో విడుదలైన సంచలనాలు క్రియేట్ చేసింది. పాన్ ఇండియా చిత్రంగా విడుదలై రికార్డ్ లను షేక్ చేసింది. సుమారు 350కోట్లు వసూలు చేసి నాన్ `బాహుబలి` రికార్డ్ లను తిరగరాసింది. ఇందులో పుష్పరాజ్ పాత్రలో డీ గ్లామర్ లుక్‌లో తగ్గేదెలే అంటూ బన్నీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బాక్సాఫీస్ వద్ద ఊర `మాస్` జాతరతో అదరహో అనిపించాడు. ఇప్పుడు `పుష్ప` సీక్వెల్ `పుష్ప` 2` చేస్తున్నారు బన్నీ. ఈ సినిమాతో ఇంకెన్ని రికార్డు క్రియేట్ చేస్తాడో చూడాలి. Telugu Oora Mass Movie.
ఈ సినిమాల స్ఫూర్తితో మరికొన్ని చిత్రాలు తెలుగులో రాబోతున్నాయి. `బాహుబలి`(Bahubali)తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్(Prabhas) సైతం డీ గ్లామర్, రా జోనర్ ని ఎంచుకున్నారు. `సలార్`(Salaar)లో ఆయన పూర్తి డీ గ్లామర్ రోల్ చేస్తున్నారు. ప్రశాంత్ నీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. `కేజీఎఫ్` సినిమా కూడా చాలా వరకు రా, రస్టిక్‌గా ఉంటుంది. దానికి `సలార్` నెక్ట్స్ లెవల్‌గా ఉండబోతుందని టాక్. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. శృతి హాసన్ హీరోయిన్. ఫస్ట్ టైమ్ ప్రభాస్ ఇలాంటి పూర్తి స్థాయి డీ గ్లామర్ రోల్ చేయబోతున్నారు. ఇది వర్కౌట్ అయితే బాక్సాఫీసు వద్ద ఊర `మాస్` జాతర మామూలుగా ఉండదు.
పక్కింటి అబ్బాయిగా, మనలో ఒకడిగా అనిపించే నేచురల్ స్టార్ నాని సైతం ఫస్ట్ టైమ్ ఓ రా, రస్టిక్ మూవీ ట్రై చేస్తున్నారు. `రంగస్థలం`, `పుష్ప` చిత్రాలతో రామ్‌చరణ్, బన్నీ ఇచ్చిన ధైర్యంతో ఆయన `దసరా` సినిమా చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇందులో పూర్తి ఢీ గ్లామర్( రా) లుక్‌లో కనిపించి షాకిచ్చారు నాని. శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో `ధరణి` అనే పాత్రలో నాని కనిపించబోతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా సాగుతుందని తెలుస్తుంది. కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తుంది. నాని కెరీర్‌లో ఇదొక నెక్ట్స్ లెవల్ మూవీగా ఉండబోతుంది.
మరోవైపు మాస్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచే మాస్ మహారాజా రవితేజ(Raviteja) మరింత సైతం `ఊర మాస్` జాతరకి తెరలేపారు. ఆయన `టైగర్ నాగేశ్వరరావు`(Tiger Nageswararao Movie) చిత్రంలో ఊరమాస్ రోల్ చేస్తున్నారు. స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న చిత్రమిది. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఉగాది పండుగ సందర్భంగా నేడు ఈ సినిమా ప్రారంభమైంది. సినిమా ప్రీ లుక్‌ని చిరంజీవి విడుదల చేయగా, ఇందులో రవితేజ లుక్ రా గా, రస్టిక్, ఎప్పుడూ లేని విధంగా గుర్తుపట్టలేనంతగా ఉండటం విశేషం.
ఇలా టాలీవుడ్‌లో `ఊర మాస్` సినిమాలు ఊపందుకుంటున్నాయి. స్టార్ హీరోలు సైతం డీ గ్లామర్ లుక్, మరింత రస్టిక్ లుక్‌లో కనిపిస్తూ ఆడియెన్స్ ఫిదా చేయబోతున్నారు. ఇది ఓ రకంగా టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌గానే చెప్పొచ్చు. ఇప్పటికే తెలుగు సినిమాలు ఇండియా స్థాయిలో దుమ్మురేపుతున్నాయి. ఇలాంటి రా సినిమాలు వస్తే, అవి వర్కౌట్ అయితే ఇండియన్ బాక్సాఫీసు వద్ద ఊరమాస్ జాతరే అని చెప్పాలి. Tollywood Oora Mass Trend.