రామ్‌చరణ్‌ని కలిసేందుకు అభిమానుల సాహసం.. గుండెలకు హత్తుకుని..

First Published | Jun 25, 2021, 3:49 PM IST

రామ్‌చరణ్‌ వీరాభిమానులు పెద్ద సాహసం చేశారు. తన అభిమాన హీరోని కలిసేందుకు పాదయాత్ర చేపట్టారు. నాలుగు రోజుల పాటు నడుచుకుంటూ వచ్చి ఎట్టకేలకు చరణ్‌ని కలిశారు. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

అభిమానం అంటే సినిమా ఫ్యాన్స్ దే. తమకిష్టమైన తారల కోసం ఏమైనా చేసేందుకు ఇష్టపడతారు. వారిని ఒక్కసారి కలిసి, ఒక్క ఫోటో దిగితే అందులో ఉండే కిక్కే వేరప్పా. అభిమానం అంటే అదే. చాలా నిస్వార్థమైంది.
ఇటీవల సోనూ సూద్‌ అభిమాని కాలినడకన ఇంటికి చేరుకని ఆయన్ని కలిశాడు. అలాగే రష్మీక అభిమాని సైతం ఇదే చేశాడు. ఇప్పుడు రామ్‌చరణ్‌ అభిమానులు సైతం కాలినడకన వందల కిలోమీటర్లు దాటుకుని వచ్చారు.

జోగులాంబ గద్వాల్‌కి చెందిన సంధ్యా జయరాజ్‌, రవి, వీరేష్‌ అనే ముగ్గురు `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్ రామ్‌చరణ్‌కి వీరాభిమానులు. ఆయన్ని కలవాలని, తమ ఆనందాన్ని, అభిప్రాయాలను పంచుకోవాలను నిర్ణయించుకున్నారు.
దాదాపు 231 కిలోమీటర్లు, నాలుగు రోజుల పాటు కాలినడకన నడుచుకుంటూ వెళ్లారు. చివరికి ఎట్టకేలకు చరణ్‌ని కలుసుకున్నారు. ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. చరణ్‌ సైతం వారిని అంతే ప్రేమాభిమానంతో స్వాగతం పలికాడు. గట్టిగా హగ్‌ ఇచ్చి వారి మనసులను గెలుచుకున్నాడు.
తాజాగా ఈ ఫోటోలను మీడియాతో పంచుకున్నారు. ఇందులో ముగ్గురు అభిమానులు అభిమాన హీరోని కలిసిన నేపథ్యంలో తమ ఆనందాన్ని పంచుకున్నారు. వారి హ్యాపీనెస్‌కి అవధుల్లేవని చెప్పొచ్చు. అభిమాన హీరోని ప్రత్యక్షంగా చూడటమేకాదు, డైరెక్ట్ గా వారితో మాట్లాడి వారితో ముచ్చటించడమంటే మామూలు విషయంలో కాదు. అంతటి అదృష్టం లభించడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
రామ్‌చరణ్‌ ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తున్నారు. ఇటీవల తిరిగి షూటింగ్‌ ప్రారంభమైంది. ఇందులో చెర్రీ పాల్గొంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌ కూడా షూటింగ్‌లో జాయిన్‌ అయినట్టు తెలుస్తుంది.రాజమౌళి దర్శకత్వంలో ఇది పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. దీంతోపాటు తండ్రి మెగా స్టార్‌ చిరంజీవితో కలిసి `ఆచార్య`లో నటిస్తున్నాడు చరణ్‌. త్వరలోనే శంకర్‌ సినిమాని పట్టాలెక్కించే అవకాశాలున్నాయి.

Latest Videos

click me!