ఎగ్జామ్‌ రాయకుండానే టీచర్‌ జాబ్‌ కొట్టేసిన అనుపమా పరమేశ్వరన్‌.. లక్‌ అంటే ఆమెదే మరీ.. అసలు కథ ఇది!

Published : Jun 25, 2021, 02:58 PM ISTUpdated : Jun 25, 2021, 03:06 PM IST

`ప్రేమమ్‌` బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ టీచర్‌ని ఎంపికైంది. `టెట్‌` పరీక్షల్లో మంచి మార్కులతో పాసై జాబ్‌ కొట్టేసింది. హీరోయిన్‌గా రాణిస్తున్న అనుపమాకి టీచర్‌గా చేయాల్సిన కర్మేంటి అనుకుంటున్నారా? అయితే ఈ కథ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే.  

PREV
17
ఎగ్జామ్‌ రాయకుండానే టీచర్‌ జాబ్‌ కొట్టేసిన అనుపమా పరమేశ్వరన్‌.. లక్‌ అంటే ఆమెదే మరీ.. అసలు కథ ఇది!
మలయాళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్‌ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నిలబడేందుకు ప్రయత్నిస్తుంది. పూర్తిగా సినిమాలపై ఫోకస్‌ పెట్టి కష్టపడుతుంది.

27
ఇంతలో ఈ అమ్మడికి టీచర్‌ జాబ్‌ వచ్చింది. అది కూడా బీహార్‌ లో కావడం విశేషం. 77శాతం మార్కులతో `టెట్‌`(టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్)లో పాసైంది. కానీ ఆమె పేరు మాత్రం మారిపోయింది. రిషికేశ్‌ పేరుతో ఆమె టెట్‌ పాస్ కావడం విశేషం. ఇదిలా ఉంటే ఆమె ఎగ్జామ్‌ రాయకుండా పాస్ కావడం మరో విశేషం.

37
అసలు విషయానికి వస్తే.. తాజాగా బీహార్‌లో టెట్‌ ఫలితాలు వెల్లడించారు. అందులో రిషికేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి 77 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. కానీ అతని స్కోర్‌ కార్డులో అతని ఫోటోకి బదులు అనుపమా పరమేశ్వరన్‌ ఫోటో ప్రింట్‌ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.

47
నిజానికి రిషికేశ్‌ అడ్మిట్ కార్డుపై కూడా అనుప‌మ ఫొటో వ‌చ్చింది. అప్పుడత‌ను విద్యాశాఖాధికారుల‌ను సంప్ర‌దిస్తే, త‌ప్పును స‌రిచేస్తామ‌న్నారు. కానీ స‌రిచేయ‌లేదు. దాంతోనే రిషికేశ్ టెట్‌ ఎగ్జామ్‌ రాశాడు.

57
తీరా ఫలితాలు వ‌చ్చిన త‌ర్వాత కూడా స్కోర్ కార్డుపై కూడా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఫొటోనే ఉండ‌టంతో షాకైన రిషికేశ్ వ్య‌వ‌హారాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్త వైర‌ల్ కావ‌డంతో విద్యాశాఖాధికారులు ద‌ర్యాప్తుకు ఆదేశించారు.

67
బీహార్‌ విద్యాశాఖలో గతంలోనూ ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకున్నాయి. జూనియర్‌ ఇంజనీర్‌ పరీక్షలో బాలీవుడ్‌ బ్యూటీ సన్నీలియోన్‌ను టాపర్‌గా ప్రకటించి నవ్వులపాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు అనుపమా పరమేశ్వరన్‌ ఫోటోతో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. అక్కడి విద్యా వ్యవస్థలోని లోపాలను మరోసారి ఎత్తిచూపుతుంది.

77
దీనికి బీహార్‌ ప్రభుత్వం ఇచ్చిన షాక్‌కి అనుపమా ఎలా స్పందిస్తుందో చూడాలి. కానీ ఈ విషయాలో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం విశేషం. నెటిజన్లు బీహార్‌ విద్యా శాఖపై సెటైర్లు వేస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories