ప్రొఫెషనల్ గా పర్సనల్ గా ఉపాసన, చరణ్ లు సక్సెస్ ఫుల్ జర్నీ సాగిస్తున్నారు. అయితే సమాజం దృష్టిలో మాత్రం వీరికో లోటు ఉంది. అదే సంతానం లేకపోవడం. పెళ్ళై పదేళ్లు అవుతున్నా ఉపాసన-చరణ్ లకు పిల్లలు కనలేదు. ఎంత బిజీ లైఫ్ అయినప్పటికీ ఇంత గ్యాప్ అంటే, ఎవరూ అంగీకరించరు. అలాగే వయసులో పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఈ విషయం మనకంటే ఉపాసన, చరణ్ లకు ఇంకా బాగా తెలుసు.