మహేష్ లేకుండా చరణ్ తో పార్టీ చేసుకున్న నమ్రత... చేయి పట్టుకుని పక్కపక్కనే నిల్చుని పోజు!

First Published | Dec 29, 2023, 11:23 AM IST

నమ్రత శిరోద్కర్-రామ్ చరణ్ ఓ పార్టీలో సెంటరాఫ్ అట్రాక్షన్ అయ్యారు. నమ్రత ఈ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీలో మహేష్ లేకపోవడం విశేషం. 
 

Namrata Shirodkar

మహేష్ బాబు-రామ్ చరణ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్. ఎన్టీఆర్ తో కూడా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటారు. వీరి భార్యలు మరింత క్లోజ్. నమ్రత శిరోద్కర్-ఉపాసన వెరీ క్లోజ్. పార్టీలు, పండగలు కలిసి జరుపుకుంటారు. 
 

Namrata Shirodkar


ఇటీవల పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి ఇంట్లో గ్రాండ్ పార్టీ జరిగింది. ఈ పార్టీకి రామ్ చరణ్, మహేష్ బాబు సతీసమేతంగా హాజరయ్యారు. వీరి ఫోటోలు వైరల్ అయ్యాయి. దీపావళి, క్రిస్మస్ వేడుకలను నమ్రత, ఉపాసన కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. 
 


Namrata Shirodkar

తాజాగా వీరు ఓ బర్త్ డే పార్టీకి హాజరయ్యారు. విష్ణురాజు అనే వ్యక్తి ఉపాసన, నమ్రతలకు కామన్ ఫ్రెండ్ అని సమాచారం. ఆయన బర్త్ డే సెలెబ్రేషన్స్  హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగాయి. ఇక పార్టీ వేర్లో నమ్రత అదిరిపోయింది. పార్టీ కోడ్ ప్రకారం చాలా మంది బ్లాక్ అవుట్ ఫిట్ లో దర్శనం ఇచ్చారు.

Namrata Shirodkar


ఈ పార్టీలో రామ్ చరణ్ చేయి పట్టుకుని నమ్రత పోజ్ ఇవ్వడం ఆకర్షించింది. ఇక షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు మాత్రం హాజరు కాలేదని తెలుస్తుంది. నమ్రత షేర్ చేసిన ఒక్క ఫొటోలో కూడా మహేష్ బాబు లేడు. రామ్ చరణ్ మాత్రం భార్య ఉపాసనతో పాటు జాయిన్ అయ్యాడు.
 

మరోవైపు మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్ పూర్తి చేశాడు. వెంటనే ఫ్యామిలీతో దుబాయ్ ఫ్లైట్ ఎక్కారు. మహేష్-నమ్రత పిల్లలు గౌతమ్, సితారలతో దుబాయ్ వెళ్లారు. అక్కడ మహేష్ బాబుకు ఓ యాడ్ షూట్ ఉందట. ఇది షార్ట్ వెకేషన్ అని తెలుస్తుంది. నమ్రత అక్క శిల్పా శిరోద్కర్ దుబాయ్ లోనే ఉంటారు. 

దుబాయ్ నుండి వచ్చిన వెంటనే మహేష్ బాబు గుంటూరు కారం మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటారు. గుంటూరు కారం చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. 
 

Latest Videos

click me!