రాంచరణ్, అల్లు అర్జున్ నెపో కిడ్స్ కాదు.. కారణం తెలిస్తే మైండ్ బ్లాక్, ఇచ్చిపడేసిన నాగవంశీ
రాంచరణ్, అల్లు అర్జున్ నెపో కిడ్స్ కాదని నిర్మాత నాగవంశీ అన్నారు. తెలుగులో అసలు నెపోటిజం లేదని నాగవంశీ తెలిపారు.
రాంచరణ్, అల్లు అర్జున్ నెపో కిడ్స్ కాదని నిర్మాత నాగవంశీ అన్నారు. తెలుగులో అసలు నెపోటిజం లేదని నాగవంశీ తెలిపారు.
ఒకప్పుడు దిల్ రాజు తరహాలో వరుసగా హిట్స్ కొడుతున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఇటీవల కాలంలో నాగవంశీ టిల్లు స్క్వేర్, లక్కీ భాస్కర్, డాకు మహారాజ్ రీసెంట్ గా మ్యాడ్ స్క్వేర్ లాంటి హిట్ చిత్రాలు నిర్మించారు. శుక్రవారం రోజు విడుదలైన మ్యాడ్ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీనితో నాగవంశీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ టాలీవుడ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
యాంకర్ నాగవంశీని నెపోటిజం గురించి ప్రశ్నించారు. బాలీవుడ్ లో నెపోటిజం ఉంది. దాని గురించి దేశం మొత్తం చర్చ జరుగుతోంది. కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో, తమిళం, మలయాళం, కన్నడ ప్రతి చిత్ర పరిశ్రమలో నేపోటిజం ఉంది. కానీ బాలీవుడ్ నెపోటిజం గురించి మాట్లాడినంతగా సౌత్ నెపోటిజం గురించి ఎవరూ మాట్లాడడం లేదు. తెలుగులో నెపోటిజం గురించి మీరేమంటారు అని యాంకర్ ప్రశ్నించారు. దీనితో నాగవంశీ తనదైన శైలిలో ఇచ్చిపడేశారు.
ఇతర భాషల గురించి నాకు తెలియదు. కానీ తెలుగులో నెపోటిజం ఉందని నేను అనుకోవడం లేదు. తెలుగులో నిజంగా నెపోటిజం ఉంటే నాని అంత పెద్ద స్టార్ అయ్యేవారు కాదు. విజయ్ దేవరకొండకి అంత క్రేజ్ వచ్చేది కాదు. సిద్దు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి, అడివి శేష్ లాంటి హీరోలు టాలీవుడ్ లో ఉండేవారు కాదు అని నాగవంశీ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నెపోటిజం లేదు నన్ను నమ్మండి అని నాగవంశీ అన్నారు. దీనితో యాంకర్ తిరిగి ప్రశ్నించారు.
చాలా మంది హీరోలు చిత్ర పరిశ్రమలో ఉన్న కుటుంబాల నుంచి వచ్చారు కదా అని అడిగారు. అల్లు అర్జున్ సార్ ని మీరు ఇంకా నెపో కిడ్ గానే భావిస్తారా అని నాగవంశీ అడిగారు. ఆయన చిత్ర పరిశ్రమలో ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా అని యాంకర్ అన్నారు. అది నిజమే, అంత మాత్రాన నెపో కిడ్ అనడం కరెక్ట్ కాదు. రాంచరణ్ సార్ ని నెపో కిడ్ గా భావిస్తారా ? ఆయన మగధీర చిత్రం కోసం ఎంత ఎఫర్ట్ పెట్టారో తెలుసా.. రంగస్థలం చిత్రం కోసం ఎంత ఎఫర్ట్ పెట్టారో తెలుసా.. అంటూ నాగవంశీ కౌంటర్ ఇచ్చారు.
నాగవంశీ తన చిత్రాల గురించి మాట్లాడుతూ.. ఇటీవల తన నిర్మాణంలో వచ్చిన చిత్రాల్లో లక్కీ భాస్కర్ చిత్రం చాలా స్పెషల్ అని తెలిపారు. ఆ చిత్రం హిట్ అవుతుందని తెలుసు. మేం ఆశించిన దానికంటే ఇంకా పెద్ద హిట్ అయింది అని నాగవంశీ తెలిపారు. నెట్ ఫ్లిక్స్ లో దాదాపు 10 వారాలు టాప్ 10 లో ట్రెండ్ అయింది అని నాగవంశీ అన్నారు.