మెగా పవర్ స్టార్ రాంచరణ్ చిరుత చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నారు. రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి అనేక విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చరణ్ ని ప్రతి ఒక్కరూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాంచరణ్ కెరీర్ లో కొన్ని మెమొరబుల్ చిత్రాలు ఉన్నాయి.
చిరుత చిత్రంతో చరణ్ ఎంట్రీ అదిరిపోయింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర చిత్రం ఇండస్ట్రీ రికార్డులని చెరిపివేసింది. బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా అవతరించింది. ఆ తర్వాత రాంచరణ్ కొన్ని మాస్ చిత్రాల్లో నటించారు. కొన్ని హిట్స్ అయ్యాయి. మరికొన్ని ఫ్లాపులు ఉన్నాయి. ఈ క్రమంలో చరణ్ పై విమర్శలు కూడా వచ్చాయి. యాక్టింగ్ లో చరణ్ ఇంకా రాటుదేలాలి అని కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో రాంచరణ్ నటించిన తుఫాన్ చిత్రం విషయంలో చరణ్ ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
Ram Charan
తనపై వస్తున్న విమర్శలన్నింటికీ రంగస్థలం చిత్రంతో రాంచరణ్ ధీటైన సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రాంచరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ రంగస్థలం చిత్రాన్ని మించేలా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Ram Charan
మగధీర చిత్రం విషయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనని రాంచరణ్ ఓ ఇంటర్వ్యూలో షేర్ చేశారు. గుర్రాలు అంటే తన కి అడిక్షన్ ఏర్పడింది అని రాంచరణ్ తెలిపారు. చిన్నతనంలో నాన్నగారితో కలసి ఊటీకి షూటింగ్ కీవ్ వెళ్ళాను. అక్కడ ఎక్కడ చూసిన గుర్రాలు కనిపించేవి. సరదాగా హార్స్ రైడింగ్ మొదలు పెట్టాను. అది కాస్త అడిక్షన్ గా మారిపోయింది అని రాంచరణ్ తెలిపారు. అది నా కెరీర్ లో బాగా ఉపయోగపడింది.
Ram Charan
చిరుత తర్వాత రాజమౌళి తో మగధీర చిత్రం ప్రారంభించాలి. ఆ టైంలో రాజమౌళి గారు నీకు ఏం వచ్చు, దీనిపై బాగా ఇంట్రెస్ట్ ఉంది అని అడిగారు. హార్స్ రైడింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. నేర్చుకున్నాను కూడా అని చెప్పా. అవునా.. అయితే నిన్ను ఒక నెల తర్వాత మళ్ళీ కలుస్తా అని చెప్పారు. నా హార్స్ రైడింగ్ కోసమే మగధీర చిత్రంలో రాజమౌళి గుర్రాల సన్నివేశాలు పెట్టారు. అవి కాస్త సినిమాకే హైలైట్ అయ్యాయి అని చరణ్ పేర్కొన్నారు. తాను సొంతంగా 6 గుర్రాలని పెంచుతున్నానని కూడా చరణ్ తెలిపారు.