Savitri Gemini Ganesan
ఎంత గొప్ప జీవితం అనుభవించిందో.. అన్ని కష్టాలు కూడా అనుభవించారు మహానటి సావిత్రి. నటిగా స్టార్ డమ్ చూసింది, సంపద విషయంలో రాణిలా బ్రతికింది. చేతికి ఎముకలేనట్టుగా దాన ధర్మాలు చేసింది. ఎంతో మందిని పేదరికం నుంచి బయటపడేసింది. ఆడపిల్లల పెళ్లిల్లు చేసింది. ఆమె చేతి నుంచి సాయం పొందిన చాలామంది.. ఆతరువాత సావిత్రి కష్టాల్లో ఉన్న సమయంలో ఏమాత్రం సాయం చేయడానికి ముందుకు రాలేదు.
Also Read: నయనతార కు షాక్, మూకుతి అమ్మన్ 2 నుండి ఆమె అవుట్?
Savitri
సావిత్రి పరిస్థితి తెలిసి.. ఎవరు ఆమెను పలకరించలేదు. అయినా సరే సావిత్రి ఏ విషయంలో క్రుంగిపోలేదు. ధైర్యంగా బ్రతికింది. తన దగ్గర సపంద లేని టైమ్ లో కూడా చేయి చాచిన వారికి ఏదో ఒక రకంగా సాయం చేస్తూ వచ్చింది సావిత్రి. అంత మంచితనం వల్లనే కావచ్చు ఇప్పటికీ ఆమె అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. మహానటిగా మిగిలిపోయింది.
ఎంతో మంది అభిమానులు ఇప్పటికీ సావిత్రిని రోజుకు ఒక్క సారి అయిన తలుచుకుని బాధపడుతుంటారు. ఇక సెలబ్రిటీలు చాలామంది సావిత్రితో తమకు ఉన్న అనుబంధం గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈక్రమంలోనే ఓ సీనియర్ నటి, ఆతరం హీరోయిన్ కె విజయ సావిత్రికి సబంధించిన ఓ సంఘటను గుర్తు చేసుకుని బాధపడ్డారు. ఆమె మంచితనం ఎలా ఉంటుందో వివరించారు. ఇంతకీ కే విజయ ఏం చెప్పారంటే?
నటిగా మంచి బిజీగా ఉన్న టైమ్ లో కె విజయ ఓ సారి ట్రైయిన్ లో ప్రయాణిస్తున్నారట. విజయవాడ నుంచి చెన్నై వెళ్తుండగా ఫస్ట్ క్లాస్ బోగీలో ఓంగోలు రాగానే సావిత్రి ఆమె అసిస్టెంట్ ఎక్కారట. అయితే టీసీ వచ్చి టికెట్ అడిగితే సావిత్రి ఉంది అనుకున్నారట. కాని ఒంగోలు లో ఓ కార్యక్రమంనికి వచ్చిన ఆమెకు.. అక్కడి వ్యక్తులు బాధ్యతగా టికెట్ ఇచ్చి పంపించలేదు. దాంతో సావిత్రి ఇబ్బంది పడ్డారట.
టికెట్ చూపించండి.. లేదంటే డబ్బులు కట్టండి.. లేదంటే నెక్ట్స్ స్టేషన్ లో దిగండి అని సావిత్రికి టీసీ చెప్పారు. దాంతో ఆమె గొంతు గుర్తు పట్టి ఎవరా అని చూసిన విజయ సావిత్రి అని తెలిసి వెంటనే డబ్బులు కట్టారట. దాంతో ఎంతో సంతోషించిన సావిత్రి.. విజయను కౌగిలించుకుని చాలా థ్యాంక్స్ అమ్మ.. నువ్వు చాలా హెల్ప్ చేశావు. ఇంటికి వెళ్ళగానే డబ్బులు పంపిస్తాను అని చెప్పారట.
అనుకున్నట్టుగానే వెళ్లిన రెండో రోజు సావిత్రి ఫోన్ చేశారట. చేసి డ్రైవర్ కు డబ్బలు ఇచ్చి పంపిస్తున్నాను అని అడ్రెస్ అడిగారట. ఇప్పుడు ఎందుకమ్మా అని అంటే.. లేదమ్మ నువ్వు చేసిన సాయం మామూది కాదు. ఎలా మర్చిపోగలం, అని పదే పదే గుర్తు చేసుకున్నారట.
అంత మంచివారు ఆమె. ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే .. ఆపరట సావిత్రి. ఎవరికైనా ఇస్తే మాత్రం వెంటనే మర్చిపోతారట. దానం గుర్తు పెట్టుకోరు సావిత్రి. అందుకే ఆమె డబ్బులు ఇచ్చినవారంతా సావిత్రిని మోసం చేశారు. చివరిక్షణంలో ఆమెకు కాపాడటానికి ఎవరు రాలేదు. ఆర్ధిక ఇబ్బందులు, తాగుడికి బానిసైన సావిత్రి.. కోమాలోకి వెళ్లి 14నెలల వరకూ కోమాలోనే ఉన్నారు. 46 ఏళ్ళ చిన్నవయస్సులో ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.