2022లో రకుల్ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. అయితే ఒక్కటి కూడా ఫలితం ఇవ్వలేదు. వరుసగా ఆమెకు ప్లాప్స్ పడ్డాయి. అయినప్పటికీ ఆమె చేతిలో ఇంకా కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కమల్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 లో ఓ హీరోయిన్ గా రకుల్ నటిస్తున్నారుఇక తెలుగులో ఆమె కెరీర్ ముగిసినట్లే. రకుల్ టాలీవుడ్ లో హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది. ఆమె రీసెంట్ చిత్రాలు చెక్, కొండపొలం డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఆమెకు దారులు మూసుకుపోయాయి. అనవసరంగా బాలీవుడ్ కి వెళ్లి రకుల్ సౌత్ లో మార్కెట్ కోల్పోయారు.