Tamannaah Bhatia : సీనియర్ నటి జమున బయోపిక్ లో తమన్నా? నిజమేనా?

First Published | Jan 28, 2023, 1:37 PM IST

సీనియర్ నటి, దివంగత జమున (Jamuna) మరణవార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే వారికి కాస్తా ఉపశమనం కలిగించేలా ఓ బజ్ వినిపిస్తోంది.. ప్రఖ్యాత నటీమణి జమున బయోపిక్ రానున్నట్టు తెలుస్తోంది.
 

సీనియర్ నటి జమున మరణవార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడిప్పు షాక్ నుంచి బయటికి వస్తున్నారు. చేధునిజాన్ని నమ్మలేకపోతున్నారు. ఇలాంటి బాధాకరమైన ఘటన నుంచి అభిమానులు తేరుకునేలా ఓ బజ్ వినిపిస్తోంది.. ప్రఖ్యాత నటీమణి జమున బయోపిక్ రానున్నట్టు తెలుస్తోంది. 
 

1953 నుంచి మొదలైన ఆమె సినీ ప్రస్థానం, అలాగే రాజకీయన జీవితం, వ్యక్తిగత విషయాలను దాదాపు అందరికీ తెలిసిందే. మరిన్ని అంశాలతో జమున బయోపిక్ ను తీసేందుకు కోలీవుడ్ లో సన్నహాలు జరుగుతున్నట్టు గట్టి బజ్ వినిపిస్తోంది. అయితే ఇందులో మిల్క్ బ్యూటీ తమన్నా నటించబోతున్నట్టు తెలుస్తోంది.
 


ఆమె బయోపిక్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారని కోలీవుడ్ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జమున పాత్ర కోసం తమన్నాకు కథ కూడా వినిపించారని అంటున్నారు.  ఇందుకు మిల్క్ బ్యూటీ సైతం అంగీకరించిందని నెట్టింట న్యూస్ వైరల్ అవుతోంది. దీనిపై ఇంకా అధికార ప్రకటన రాలేదు. 
 

ఇప్పటికే అలనాటి దివంగత నటి సావిత్రి బయోపిక్ లో కీర్తి సురేష్,  సిల్క్ స్మిత బయోపిక్ లో విద్యాబాలన్, దివంగత జయలలిత జీవిత చరిత్రలో కంగనా రనౌత్ నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటి జమున బయోపిక్ (Jamuna Biopic) కూడా రాబోతుందనే బజ్ తో మరింత ఆసక్తి నెలకొంది. అందులోనూ తమన్నా నటించబోతుందని ప్రచారం జరగడం ఇంట్రెస్టింగ్ గా మారింది. 
 

ఇక అలనాటి నటి, వెండితెరపై తిరుగులేని స్టార్ హీరోయిన్ వెలుగొందిన సీనియర్ నటి, దివంగత జమున (Jamuna) నిన్న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని ఆమె నివాసంలో 86వ ఏటా తిరిగిరాని లోకానికి వెళ్లారు. ఆమె భౌతిక కాయానికి సినీతారలు, పలువురు రాజకీయ వేత్తలు పూలమాలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఇక నిన్ననే ఆమె అంత్యక్రియలు కూడా నిర్వహించారు.   
 

తమన్నా ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి సరసన `భోళాశంకర్‌`లో నటిస్తోంది. అటు తమిళంలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో `జైలర్‌`లో నటిస్తుంది. నెల్సన్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు భోలే చుడియా, బంద్రలో నటిస్తోంది. ఇక నటి జమున బయోపిక్ రాబోతుందని, తమన్నా నటించబోతుందంటూ కూడా బజ్ రావడం ఆసక్తికరంగా మారింది.

Latest Videos

click me!