ఇటీవల ఈ అందాల భామ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ సరసన నటించేందుకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.
ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో రకుల్ డీ గ్లామర్ లుక్‌లో కనిపించనుందట. పూర్తిగా మేకప్ లేకుండా తెరపై వయ్యారాలు పోయేందుకు రెడీ అవుతుందట.
సినిమా బ్యాక్ డ్రాప్ ప్రకారం రకుల్ ఓ మహిళా రైతు కూలీగా మెరవబోతున్నట్టు సమాచారం. పల్లెటూరి అమ్మాయిగా, మోటుగా కనిపిస్తుందని టాక్. ఆమె పాత్ర పూర్తిగామాస్‌గా ఉంటుందని తెలుస్తుంది. గతంలో `సరైనోడు`లో కాసేపు డీ గ్లామర్ లుక్‌లో రకుల్ మెరిసిన విషయం తెలిసిందే.
సినిమా ఫారెస్ట్ లో సాగుతుండటంతో ఇందులో యానిమల్స్ కి కూడా ప్రయారిటీ ఉంటుందని, ప్రస్తుతం వికారాబాద్ ఫారెస్ట్ షూటింగ్ జరుగుతుందని సమాచారం.
మరోవైపు బాలీవుడ్ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతుంది రకుల్. బాలీవుడ్‌లో అర్జున్ కపూర్‌తో ఓ సినిమా చేస్తుంది.
ఈ సినిమా షూటింగ్ ఈ నెల 25నుంచి తిరిగి పున ప్రారంభం కాబోతుంది. ఈ విషయాన్ని బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. లవ్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది.
వీటితోపాటు ప్రస్తుతం రకుల్ తెలుగులో నితిన్, చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్‌లో రూపొందే చిత్రంలో, అలాగే తమిళంలో `భారతీయుడు 2`, `అయలాన్`, హిందీలో `ఎటాక్`చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.