రకుల్‌ పెళ్లి ఫిక్స్..? ప్రియుడిని పెళ్లాడబోతున్న స్టార్‌ బ్యూటీ.. ఎక్కడ, ఎప్పుడు అంటే ?

Published : Jan 01, 2024, 02:54 PM ISTUpdated : Jan 01, 2024, 03:53 PM IST

గతేడాది సినిమా సెలబ్రిటీలు చాలా మంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడు రకుల్‌ కూడా తమ ప్రేమని  పెళ్లి  వరకు తీసుకెళ్తుంది. తాజాగా ముహూర్తం ఫిక్స్ చేసుకుందట.   

PREV
17
రకుల్‌  పెళ్లి ఫిక్స్..? ప్రియుడిని పెళ్లాడబోతున్న స్టార్‌ బ్యూటీ.. ఎక్కడ, ఎప్పుడు అంటే ?

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. గత కొంత కాలంగా బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల తమ ప్రేమని బహిర్గతం చేశారు. ఇద్దరు  ఈవెంట్లలో మెరుస్తున్నారు. ముంబయి వీధుల్లోనూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.
 

27
Jackky Bhagnani, Rakul Preet Singh

తమ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్తారా? లేక డేటింగ్‌తోనే సరిపెడతారా? అనే డౌట్లు వినిపించాయి. తాజాగా దీనికి సంబంధించిన ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. రకుల్‌ ఎట్టకేలకు పెళ్లికి  సిద్ధమయ్యిందట. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందని తెలుస్తుంది.  అంతేకాదు ముహూర్తం  కూడా  ఫిక్స్  అయ్యిందని అంటున్నారు. 
 

37
Rakul Preet Singh and Jackky Bhagnani

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాకీ భగ్నాని..  తమ ప్రేమని  పెళ్లి వరకు తీసుకెళ్తున్నారని తెలుస్తుంది. ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. అందుకు  సంబంధించిన ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారని తెలుస్తుంది. వీరి పెళ్లికి సంబంధించిన డెస్టినీ వెడ్డింగ్‌ వేదిక కూడా ఫిక్స్ అయ్యాందని తెలుస్తుంది. 

47

గోవాలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని, ఆల్మోస్ట్ వేదిక ఫైనల్‌ అయ్యింది. తమ ప్రేమకి గుర్తుగా గోవాని వెడ్డింగ్‌ వేదికగా చేసుకున్నారని తెలుస్తుంది.  ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య పెళ్లికి  సంబంధించిన చర్చలు జరిగాయని, త్వరలోనే అధికారికంగా ఈ పెళ్లి విషయాలను బయటపెట్టే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్తలు వైరల్‌ అవుతున్నాయి.
 

57

దీంతో ఇప్పుడు రకుల్‌ అభిమానులు హర్ట్ అవుతున్నారు. ఆమెని ఆరాధించే అభిమానులు బెంగ పెట్టుకుంటున్నారు. ఇతర అభిమానులు ఖుషి అవుతున్నారు. తమ అభిమాన నటి కూడా ఓ ఇంటికోడలు కాబోతున్న నేపథ్యంలో విషెస్‌ తెలియజేస్తున్నారు.
 

67
Rakul preet singh

టాలీవుడ్‌లో `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్‌` చిత్రంతో సక్సెస్‌ అందుకుని హీరోయిన్‌గా గుర్తింపు పొందింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఆ తర్వాత వరుసగా అవకాశాలను, సక్సెస్‌ని అందుకుంది.  స్టార్‌ హీరోల నుంచి,  యంగ్‌ హీరోల వరకు అందరితోనూ కలిసి నటించింది. అయితే ఈ బ్యూటీకి సక్సెస్‌ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువగా  ఫేస్‌ చేసింది. దీంతో టాలీవుడ్‌కి గుడ్‌ బై చెప్పి బాలీవుడ్‌కి చెక్కేసింది. 

77

అక్కడ ఓ వైపు వరుసగా సినిమా ఆఫర్లని అందుకుంది. అదే సమయంలో జాకీ భగ్నానీతో ప్రేమలోనూ పడింది. దాదాపు మూడేళ్లుగా వీరి ప్రేమ కొనసాగుతుంది.  మూడేళ్ల డేటింగ్‌ అనంతరం ఇప్పుడు పెళ్లికి సిద్ధమవడం విశేషం. నటుడిగా రాణించిన జాకీ.. ఇప్పుడు ప్రొడక్షన్‌కే పరిమితమయ్యారు. మరోవైపు రకుల్‌ హిందీలో రెండు, తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories