సినిమాలు మానేసి బిజినెస్‌ ఉమెన్‌గా రకుల్ ప్రీత్‌ సింగ్‌ టర్నింగ్‌.. హైదరాబాద్‌లో కొత్త వ్యాపారం షురూ

Published : Apr 17, 2024, 05:40 PM ISTUpdated : Apr 17, 2024, 05:45 PM IST

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సినిమాలు తగ్గించింది. ఓ రకంగా సినిమాలు మానేస్తుంది. దీంతో కొత్త రంగంలోకి అడుగుపెడుతుంది. బిజినెస్‌లు విస్తరిస్తుందీ బ్యూటీ.   

PREV
18
సినిమాలు మానేసి బిజినెస్‌ ఉమెన్‌గా రకుల్ ప్రీత్‌ సింగ్‌ టర్నింగ్‌.. హైదరాబాద్‌లో కొత్త వ్యాపారం షురూ

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కెరీర్‌ని పూర్తిగా మార్చేస్తుంది. హీరోయిన్‌ గా తెలుగు, తమిళం, హిందీలో అలరించిన ఈ భామ ఇప్పుడు కెరీర్‌ నే మార్చేస్తుంది. కొత్త వ్యాపారం షురూ చేసింది. ఇప్పటికే పలు వ్యాపారాల్లోకి దిగిన ఆమె ఇప్పుడు నయా బిజినెస్‌ స్టార్ట్ చేసింది. 

28

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి ఇప్పటికే జిమ్‌ సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఎఫ్‌ 45 పేరుతో జీమ్‌, యోగా సెంటర్లని నిర్వహిస్తుంది. వీటికి సెలబ్రిటీలు కూడా వస్తుంటారు. చాలా పాపులర్‌ వర్కౌట్‌ సెంటర్లుగా ఆదరణ పొందుతున్నాయి. సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతున్నాయి. 
 

38

ఆ మధ్య వైజాగ్‌లోనూ ఈ సెంటర్‌ని ప్రారంభించింది. అది కూడా బాగానే నడుస్తుంది. ఓ వైపు హీరోయిన్‌గా బిజీగా ఉంటూనే ఇలా నెమ్మదిగా వ్యాపారాల్లోకి అడుగుపెడుతూ సంపాదన పెంచుకుంటుంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అన్షుక అనే యోగా సెంటర్‌ని కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. 
 

48

వీటితోపాటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి వెల్‌ బీయింగ్‌ న్యూట్రిషన్‌, వెల్‌ నెస్‌ న్యూట్రిషన్‌ బ్రాండ్స్ లో రకుల్‌ కి భాగస్వామ్యం కూడా ఉందట. వాటిని మ్యానేజ్‌ చేస్తూ వచ్చింది. ఇప్పుడు నెమ్మదిగా ఫుడ్‌ బిజినెస్‌లోకి కూడా అడుగుపెట్టింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. 

58

తాజాగా `ఆరంభం` పేరుతో రెస్టారెంట్‌ని ప్రారంభించింది. హైదరాబాద్‌లో మంగళవారం దీన్ని ప్రారంభించింది. మిల్లెట్స్ తో తయారు చేసిన వంటకాలను ఇందులో అందించబోతున్నారు. చాలా స్పెషల్‌ వంటకాలకు ప్రయారిటీ ఇస్తున్నారు. హెల్త్ కి ప్రయారిటీ ఇస్తున్నారని తెలుస్తుంది. అదే సమయంలో ఆర్గానిక్‌ ఫుడ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు సమాచారం. 
 

68

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి ఇటీవల సినిమా ఆఫర్లు తగ్గిపోయాయి. ఆమె గతేడాది వరకు హిందీలో ఫుల్‌ బిజీగా ఉంది. ఏడాదికి నాలుగైదు సినిమాలను రిలీజ్‌ చేసింది. కానీ ఇప్పుడు కేవలం రెండు సినిమాలు మాత్రమే ఆమె చేతిలో ఉన్నాయి. అవి కూడా గతంలో ఒప్పుకున్న మూవీస్‌. తమిళంలో `ఇండియన్‌ 2`లో నటిస్తుంది. హిందీలో ఓ మూవీ చేస్తుంది. అవి త్వరలో విడుదలవుతాయి.

78

అవి తప్ప కొత్తగా ఇప్పటి వరకు రకుల్ మరే సినిమాకి ఒప్పుకోలేదు. ఆమె కావాలని ఒప్పుకోవడం లేదా? లేక ఆఫర్లు రావడం లేదా? తెలియదు. కానీ ఇటీవల కొత్తగా ఆమె మరే సినిమాని ప్రకటించలేదు. దీంతో తాజా పరిణామాలు చూస్తుంటే ఆమె సినిమాలు మానేసి వ్యాపారాల్లో బిజీ కాబోతుందని తెలుస్తుంది. 
 

88

ఇక ఇటీవల పెళ్లి చేసుకుంది రకుల్. తన బాలీవుడ్‌ బాయ్‌ ఫ్రెండ్‌, నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ఇటీవల గోవాలో పెళ్లి చేసుకుంది.గ్రాండ్‌గా వీరి వెడ్డింగ్‌ జరిగింది. ప్రస్తుతం కొత్త పెళ్లి కూతురిగా ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. మ్యారేజ్‌ కూడా ఆమె వ్యాపారాల్లోకి వెళ్లడానికి దోహదపడిందని చెప్పొచ్చు. ఏమైనా రకుల్‌ ఇకపై హీరోయిన్‌ మాత్రమేకాదు, వ్యాపారవేత్తగానూ తానేంటో చూపించబోతుందని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories