దేహం దేవాలయం..దాంట్లో చెత్త లేకుండా చూసుకోవాలంటోన్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

First Published Apr 11, 2021, 10:30 AM IST

మన దేహం దేవాలయం అంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. నిత్యం యోగాలు చేస్తూ, వర్కౌట్స్ చేస్తూ బాడీని ఫిట్‌గా, సెక్సీగా ఉంచుకుంటోన్న రకుల్‌ తాజాగా బాడీ ఫిట్‌నెస్‌ గురించి, ఆరోగ్య నియమాల గురించి సందేశమిచ్చింది. 

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టార్‌ హీరోగా రాణిస్తుంది. ఇప్పుడు బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టింది ఈ హాట్‌ అందాల భామ యోగా ప్రాధాన్యతని, ఎక్సర్‌సైజ్‌ ప్రయారిటీని తెలియజేసింది. హెల్త్ గురించి పెద్ద సందేశాలిచ్చింది.
undefined
మన దేశంలో హెల్త్, ఫిట్‌నెస్‌కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరని చెప్పింది. మన శరీరాన్ని మనమే కాపాడుకోవాలని పేర్కొంది రకుల్‌.
undefined
దేహం దేవాలయం లాంటిదని, ఇంట్లో చెత్త లేకుండా చూసుకుంటాం. గుడిని కూడా నీట్‌గా ఉంచుకుంటాం. అలాగే దేహంలో కూడా చెత్త లేకుండా చూసుకోవాలి` అని తెలిపింది రకుల్‌.(మంచు లక్ష్మీతో ఫోటో షూట్‌).
undefined
వ్యాయామం, యోగాని కలిసి చేయడం చాలా మంచిదని, వ్యాయామం ఫిట్‌నెస్‌ ఇస్తే, యోగా పాజిటివ్‌ దృక్పథాన్నిస్తుందని, తనకు నచ్చిన ఫుడ్‌ని ఫుల్‌గా తింటానని, కానీ యోగా, జిమ్‌ చేస్తానని వెల్లడించింది.
undefined
కనీసం రోజుకు ఐదు నిమిషాలు ఫిట్‌నెస్‌, యోగా ఎడ్యూకేషన్‌ గురించి తెలుసుకోవాలని చెప్పింది రకుల్‌.
undefined
ఇతరులనుచూసి ఎక్సర్‌సైజ్‌లు చేయడం, ఆహారపు అలవాట్లు మార్చకోవడం చేయొద్దని, మీ శరీరానికి తగినదే, మీకు ఇష్టమైనదే తినాలని, అలాంటి వ్యాయమాలే చేయాలని చెప్పింది.
undefined
`శరీరం మాత్రమే కాదు, మనసు కూడా లైట్‌గా ఉండాలి. ఆరోగ్యం కోసం కొంతమంది అదే పనిగా సలాడ్స్‌ తింటారు. అది మంచిది కాదు. కొన్ని వండుకొని తినాలి.
undefined
ఇంకా చెప్పాలంటే మన అమ్మమ్మల కాలం నాటి భోజనాలకి వెళ్లిపోవాలి. అదే సరైన పద్ధతి. తాత, అమ్మమ్మల కాలం నాటి వంటకాల వల్ల ఒంట్లో కొవ్వు చేరదు. ఫిట్‌నెస్‌ను లైఫ్‌ స్టయిల్‌గా చూడాలి. అది మన జీవితంలో భాగమైనప్పుడు ఆరోగ్యంగా ఉంటాం` అని చెప్పింది రకుల్‌.
undefined
రకుల్‌ ప్రస్తుతం తెలుగులో వైష్ణవ్‌ తేజ్‌, క్రిష్‌ చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమె పూర్తిగా డీ గ్లామర్‌ లుక్‌లో కనిపించబోతుంది రకుల్‌. మరోవైపు హిందీలో మాత్రం ఫుల్‌ బిజీగా ఉంది. `మేడే`లో అమితాబ్‌, అజయ్‌ దేవగన్‌లతో కలిసి నటిస్తుంది. `ఎటాక్‌`లో జాన్‌ అబ్రహంతో, `థ్యాంక్యూ గాడ్‌`లో అజయ్‌ దేవగన్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రాతో, అలాగే అర్జున్‌ కపూర్‌తో ఓ సినిమా చేస్తుంది. తమిళంలో శివకార్తికేయన్‌తో `అయలాన్‌` సినిమా చేస్తుంది.
undefined
ఇటీవల రకుల్‌ స్విమ్మింగ్‌ ఫూల్‌లో బికినీలో స్విమ్‌ చేస్తూ దిగిన ఫోటో తెగ వైరల్‌ అయ్యింది.
undefined
click me!