ఈ ఏడాది ఆరంభం నుంచే రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. చాలా ఓపెన్ గా ఫంక్షన్లకు, ఆయా ఈవెంట్లతో పాటు టూర్లకు కూడా వెళ్తూ సందడి చేస్తున్నారు. పార్టీలు, పబ్బులకూ వెళ్తూ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి పెళ్లి ఎప్పుడనేది అభిమానుల్లో ఆసక్తిగా మారింది.