Intinti Gruhalakshmi: తులసి నుంచి మ్యూజిక్ స్కూల్ లాక్కున్న లాస్య.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన సామ్రాట్!

First Published Oct 14, 2022, 12:36 PM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు అక్టోబర్ 14వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..తులసి చాలా కోపంతో నందు దగ్గరికి వస్తుంది.అక్కడే ఉన్న లాస్య జనరల్ మానేజర్ గారి గదిలోకి వచ్చే ముందు తలుపు కొట్టాలని తెలియదా! ఇంకో విషయం అంత కోపంగా రావడానికి ఇదేమి ఇల్లు కాదు,తనేమీ నీ మాజీ భర్త కాదు నీ బాస్ మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఇంక ఫైల్ విషయం కొస్తే అవును మ్యూజిక్ స్కూల్ ఫైల్ నా దగ్గరే ఉన్నది ఇది నేను అడగలేదు జనరల్ మేనేజర్ గారే నా పనిని చూసి నాకు ఇచ్చారు అని అనగా తులసి కోపంతో ఎవరిని అడిగి ఇచ్చారు అని నందు నీ అడుగుతుంది. జనరల్ మేనేజర్ గా ఎవరికీ ఏమి ఇవ్వాలో నాకు తెలుసు.
 

 చాలా రోజుల నుంచి మ్యూజిక్ స్కూల్ వాయిదా పడిపోతూనే ఉన్నది ఇలా లేట్ చేస్తే దాని రేట్ పెరిగిపోతుంది. అందుకే లాస్యకి ఇస్తే త్వరగా చేస్తుందని ఇచ్చాను అని అనగా, ఇలాంటి కట్టుకథలు నమ్మే నేను నా కాపురాన్ని లాస్య చేతికి ఇచ్చాను అని అనగా, పర్సనల్ విషయాలు మాట్లాడొద్దు అని లాస్య అనెలోగ తులసి ఆపి,నాకు తెలుసు నేను పర్సనల్ విషయం గురించి మాట్లాడటం లేదు నా ఫైల్ కోసం నేను ఇక్కడికి వచ్చాను. నేను జనరల్ మేనేజర్ తో మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు తలదూర్చొద్దు అని అరుస్తుంది.అదే సమయంలో సామ్రాట్ అక్కడికి వస్తాడు. నేను అంతా విన్నాను అని సామ్రాట్ లోపలికి వచ్చి ఈ ప్రాజెక్టులో నేను తల దూర్చను అన్నాను.
 

 కానీ తులసి గారిని తలదుర్చోద్దు అని చెప్పలేదు అయినా మీరు అంతా అమర్యాదుగా మాట్లాడడానికి తనేమీ మీకింద పనిచేస్తున్న ఎంప్లాయ్ కాదు ఈ ప్రాజెక్టులో తను నా వ్యాపార భాగస్వామి అది గుర్తుపెట్టుకుని మాట్లాడితే మంచిది తను మీ బాస్. భార్య కన్నా భర్త ఎన్ని విషయాల్లో పెద్ద అయినా సరే ఒక బిడ్డని పెంచి పెద్ద చేయడంలో తల్లికి సాటి ఎవరు రారు. ఈ మ్యూజిక్ స్కూల్ అనేది తన బిడ్డలాంటిది దాన్ని తులసి గారు తప్ప ఇంకా ఎవరు అంత శ్రద్ధగా చేయలేరు అని సామ్రాట్ అంటాడు.మీరు ఈ ప్రాజెక్టు విషయం నాకు చెప్పారు కదా సార్ అని నందు అనగా, అలాగని నేను తన దగ్గరి నుంచి లాక్కోమని చెప్పలేదు.
 

 తెలివిగా మాట్లాడొద్దు నంద గోపాల్ గారు అని సామ్రాట్ అనగా, నేను ఎడ్యుకేటెడ్, నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని సర్ నేను ఏమైనా చేస్తే అది తప్పు అవ్వదు కచ్చితంగా సక్సెస్ అవుతుంది అని నందు అంటాడు. ఇక్కడికి రాకముందు నువ్వు ఒక కంపెనీ పెట్టి నష్టం వచ్చి మూసుకొని కూర్చున్నావు.నువ్వు తెలివైన వాడివి కాదు అని నేను చెప్పట్లేదు అలాగని ఎదుటి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు అని అంటాడు సామ్రాట్.నందు తలదించుకొని ఉంటాడు .అప్పుడు సామ్రాట్ నందుతో, నువ్వు గౌరవం ఇస్తేనే ఎదుటి వాళ్ళు నీకు మర్యాదగా ఉంటారు మనము ఏదిస్తే అదే మనకు తిరిగి వస్తుంది.
 

 నిన్ను నువ్వు సరి దిద్దుకోడానికి ప్రయత్నించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు తులసి సామ్రాట్ తో మ్యూజిక్ స్కూల్ ఫైల్ తిరిగి ఇవ్వమని లాస్యతో చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో ప్రేమ్ పైన కూర్చుని ఉండగా శృతి అక్కడికి వచ్చి పాలు ఇచ్చి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ప్రేమ్ శృతిని ఆపి ఎందుకు శృతి ఏదో తప్పు చేసినట్టు అలా వెళ్ళిపోతున్నావు అని అనగా, నేను తప్పు చేయను నేను ఎందుకు భయపడాలి అని అంటుంది శృతి.అప్పుడు ప్రేమ్, శృతి జరిగిన విషయం అంతా మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెడదామా నేను నీ తప్పులన్నీ క్షమిస్తాను. 
 

అలాగే నువ్వు కూడా నన్ను క్షమించు. అమ్మ మనసు బాధ పెట్టి ఇన్ని రోజులు మనం ఇన్ని నాటకాలు ఆడుతున్నామంటే నాకు ఏదోలా ఉన్నది అని అనగా శృతి కోపంతో, అయినా నేనేదో తప్పు చేసినట్టు నువ్వు నాకు మోక్షం ఇచ్చినట్టు నా తప్పులన్నీ క్షమిస్తానని అనడానికి నువ్వేమి యోధుడు కాదు. నువ్వు తప్పులు చేశావు గతంలో నన్ను అన్నన్ని మాటలు అన్నావు నేను మా అత్త ఇంట్లో ఉన్నానని తెలిసి కూడా నువ్వు నన్ను చూడడానికి కూడా రాలేదు. ఇప్పుడు కూడా నువ్వు ఇన్ని మాటలు చెప్తుంది నా మీద ప్రేమతో కాదు, ఒకవేళ నిజంగా నా మీద ప్రేమతో నువ్వు ఇలా మాట్లాడితే నేను ఎగిరి గంతులు వేసి ఒప్పుకునేదాన్ని.
 

కానీ నువ్వు మీ అమ్మగారి దగ్గర ఎక్కడ దోషిగా నిలబడతావు అని చెప్పి ఇలాగా మాట్లాడుతున్నావు అని అనగా, అందులో తప్పేమున్నది శృతి అని ప్రేమ్ అంటాడు. దానికి శృతి కోప్పడి ,అసలు నీకు ఎంత చెప్పినా ఇంకా అర్థం కాదు ప్రేమ్ నువ్వు ఒక మంచి భర్తవి ఎప్పటికీ కాలేవు ఎప్పటికీ రెస్పాన్సిబుల్గా ఉండలేవు అని అనగా ప్రేమ్కి కోపం వచ్చి, అయితే మరి నాతో ఎందుకు ఉంటున్నావు వెళ్లిపో అప్పుడు ఎలా వెళ్ళిపోయావు ఇప్పుడు కూడా వెళ్ళిపో. నువ్వు లేకుండానే నేను ప్రశాంతంగా ఉంటాను మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తాను అని ప్రేమ్ అంటాడు. దానికి శృతి చాలా బాధపడుతుంది.ఆ తర్వాత సీన్లో నందు ఇంట్లో తాగుతూ జరిగిన విషమంతా గుర్తుతెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు లాస్య అక్కడికి వచ్చి భోజనం చేద్దాం నందు అని అనగా,నందు సైలెంట్ గ ఉంటాడు. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా నందు. బాస్ గా సామ్రాట్ కి ఆ కుర్చీ ఇచ్చిన పొగరు అది దాని కోసం అని చూసుకుంటే అవ్వదు కదా అని అనగా, వాడు నన్ను అన్ని మాటలు అన్నాడు. 

నా కంపెనీ గురించి మాట్లాడడానికి వాడెవడు.నన్ను అన్ని అన్నా సరే నువ్వు ఏమాత్రం పౌరుషం లేకుండా మళ్లీ అక్కడికి వెళ్తాను అంటున్నావు నేను ఇంక అక్కడికి రాను నువ్వు కూడా మనేయు అని నందు అంటాడు.అప్పుడు లాస్య, నేను మనేయను నందు అక్కడ మంచి ప్యాకేజీ ఉన్నది మనకు విలువ ఇచ్చే జాబ్ ఇచ్చారు. ఇంక ఎక్కడా మనకు ఉద్యోగాలు రావని లాస్య అంటుంది. ఇప్పుడు నాకన్నా ఉద్యోగం ఎక్కువైపోయిందా మనల్ని  నిందలు అంటూ దాన్ని భరించడానికి ఇస్తున్న కూలీ జీతాలు అవి నేను మానేసిన తర్వాత నీకే తెలుస్తుంది.అయినా తులసి నా బాస్ గా ఉండగా నేను అక్కడ ఉండలేను అని సామ్రాట్ అంటాడు. ఆ తర్వాత సీన్లో ఇంట్లో అర్ధరాత్రి శృతి బ్యాగ్ పట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోదామని అనుకుంటుంది. తలుపు తీసే సమయంలో తులసి అక్కడికి వచ్చి, ఏమైందమ్మా ఎక్కడికి వెళ్తున్నావు ఈ సమయంలో అని అనగా, అత్త ఇంటికి వెళ్తున్నాను అత్తయ్య చూడాలనిపిస్తుంది అని అంటుంది శృతి.మరి ఉదయం వెళ్ళవచ్చు కదా అని అనగా శృతి మౌనంగా ఉంటుంది.

నిజంగా నువ్వు మీ అత్తని చూడడానికే వెళ్తున్నావా అని తులసి అడుగుతుంది. దానికి శృతి ఏడుస్తూ తులసి దగ్గరికి వెళ్లి హద్దుకుంటుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు నువ్వు ఏడిస్తే నేను తప్పు చేసినట్టే లెక్క అసలు విషయం ఏమైంది అని అనగా ,శృతి జరిగిన విషయం అంటా చెప్పుకుంటూ వస్తుంది. దానికి తులసి చాలా కోప్పడి ప్రేమ్ అని అరుస్తూ ఉంటుంది.అప్పుడు ప్రేమ్ అక్కడికి వచ్చి శృతిని చూసి జరిగిన విషమంతా అమ్మకు చెప్పేసి ఉంటుంది అని అనుకుంటాడు. అప్పుడు తులసి ప్రేమ్ ని గట్టిగా చంప మీద కొడుతుంది. నేను నిన్ను ఎందుకు కొట్టానో నీకు తెలుసు అయినా నువ్వు అలా చేస్తావని నేను అనుకోలేదు. శృతిని అంత బాధ పెట్టావు పెళ్ళానికి విలువ ఇవ్వలేని నువ్వు అసలు మొగుడివేనా! నీకోసం శృతి పనిమనిషిలా కూడా ఉద్యోగం చేసింది.తను డబ్బులు సంపాదిస్తే నువ్వు సింగర్ అవ్వడానికి సహాయపడుతుంది అని తను అన్ని పనులు చేసింది.నువ్వు తిరిగి తనే అబద్ధం చెప్పింది అన్ని, నీ దగ్గర విషయం దాసింది అని తన్నే తప్పు పడుతున్నావు అని ప్రేమ్ మీద అరుస్తూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!