'కొండ పొలం'లో రకుల్ కొత్త అవతారం.. ఓబులమ్మ అందాలు వైరల్

pratap reddy   | Asianet News
Published : Oct 02, 2021, 11:16 AM IST

వైష్ణవ్ తేజ్(Panja Vaisshnav Tej), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తొలిసారి జంటగా నటిస్తున్న చిత్రం కొండ పొలం (Konda Polam). క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 8న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

PREV
18
'కొండ పొలం'లో రకుల్ కొత్త అవతారం.. ఓబులమ్మ అందాలు వైరల్

వైష్ణవ్ తేజ్(Panja Vaisshnav Tej), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తొలిసారి జంటగా నటిస్తున్న చిత్రం కొండ పొలం (Konda Polam). క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 8న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతోంది. 

 

28

ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. గొర్రెల కాపరుల ఫ్యామిలీ నుంచి చదువుకున్న యువకుడి కథగా ఈ చిత్రం ఉండబోతోంది. ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రంలో యువతని బాగా ఆకర్షిస్తున్న అంశం ఏంటంటే.. రకుల్ ప్రీత్ సింగ్ కొత్త అవతారం. 

 

38

పల్లెటూరి యువతిగా రకుల్ లంగాఓణీ అందాలకు అంతా ఫిదా కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రంలో రకుల్, వైష్ణవ్ తేజ్ మధ్య రొమాన్స్ కూడా ఘాటుగా ఉండబోతోంది. ఇప్పటికే ట్రైలర్, శ్వాసలో అంటూ సాగే లిరికల్ సాంగ్ లో ఈ విషయం స్పష్టం అయింది. 

 

48

పల్లెటూరి యువతిగా రకుల్ నాజూకు అందాలు ఆరబోస్తోంది. ఉప్పెన చిత్రంలో కృతి శెట్టితో రొమాన్స్ పండించిన వైష్ణవ్.. రకుల్ తో ఎలా చేశాడనే ఆసక్తి నెలకొంది. 

58

ఈ చిత్రంలో రకుల్ పాత్ర పేరు ఓబులమ్మ. గొర్రెలు కాచే యువతిగా కనిపించబోతోంది. అడవుల్లో వీరి మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు బలంగా ఉండబోతున్నట్లు టాక్. 

 

68

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ విఫలమవుతుంటాడు వైష్ణవ్. తిరిగి తన సొంత ఊరికి వచ్చాక అతడికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి.. ఓబులమ్మతో అతడి ప్రేమ ఏమైంది అనేవి ఈ చిత్రంలో ఆసక్తికర అంశాలు. 

78

ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రాజీవ్ రెడ్డి, సాయి బాబు నిర్మిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. 

 

88

కోటా శ్రీనివాస రావు, సాయి చంద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్రిష్ చిత్రాల్లో కథ బావున్నపటికి ఎగ్జిక్యూట్ చేయడంలో విఫలం అవుతాడనే విమర్శ ఉంది. ఈ చిత్రంతో ఆ సమస్యని క్రిష్ అధికమిస్తాడేమో చూడాలి.  

click me!

Recommended Stories