పవన్ కళ్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్ అంత లేదు మీ సినిమా బడ్జెట్.. విష్ణుపై ప్రకాష్ రాజ్ ఘాటు కామెంట్స్

First Published Oct 2, 2021, 8:02 AM IST

'మా' ఎన్నిక దగ్గర పడే కొద్దీ ప్రకాష్ రాజ్ ప్యానల్, విష్ణు ప్యానల్ మధ్య మాటల తూటాలు పెరుగుతున్నాయి. నేరుగా ప్రకాష్ రాజ్, విష్ణు పరస్పర విమర్శలకు దిగుతున్నారు.

'మా' ఎన్నిక దగ్గర పడే కొద్దీ ప్రకాష్ రాజ్ ప్యానల్, విష్ణు ప్యానల్ మధ్య మాటల తూటాలు పెరుగుతున్నాయి. నేరుగా ప్రకాష్ రాజ్, విష్ణు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. దీనితో టాలీవుడ్ లో మా ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఇటీవల రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారిన సంగతి తెలిసిందే. 

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఇండస్ట్రీకి సంబంధం లేదంటూ ఫిలిం ఛాంబర్ లేఖ కూడా విడుదల చేసింది. దీనితో విష్ణు మీడియా ముందు.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో నేను ఏకీభవించడం లేదు. ఆయన కామెంట్స్ తో ఇండస్ట్రీకి సంబంధం లేదని సినిమా పెద్దలే ఫిలిం ఛాంబర్ తరుపున లేఖ రిలీజ్ చేశారు. సో నేను సినిమా పెద్దల తరుపున, ఇండస్ట్రీ తరుపున నిలబడతాను. ఈ వ్యవహారంలో ప్రకాష్ రాజ్ తన వైఖరి ప్రకటించాలి. ఆయన పవన్ కళ్యాణ్ వైపున ఉంటారా లేక ఇండస్ట్రీ వైపున ఉంటారా తేల్చి చెప్పాలి అని విష్ణు మీడియా ముందు ప్రశ్నించాడు. 

prakash raj

విష్ణు కామెంట్స్ కి ప్రకాష్ రాజ్ ఘాటుగా బదులిచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విష్ణుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీకి, జగన్ పార్టీకి వంద ఉంటాయి. ఆ రాజకీయాలతో నాకు సంబంధం లేదు. సినిమాల విడుదల గురించి సమస్య ఉంటే ఆ విషయం గురించి పవన్ మాట్లాడారు. దానిని పట్టుకుని ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీ వైపున ఉంటారా పవన్ కళ్యాణ్ వైపున ఉంటారా అని ప్రశ్నించడం ఏంటి. నేను ఇండస్ట్రీ వైపున లేనా ? పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో భాగం కాదా ? 

ఒకటి తెలుసుకోవాలి విష్ణు.. పవన్ కళ్యాణ్ గారి మార్నింగ్ షో కలెక్షన్స్ అంతలేదు మీ సినిమా బడ్జెట్. మీకు కూడా పొలిటికల్ అజెండాలు ఉంటాయి. మీరు ప్రభుత్వానికి సపోర్ట్ చేసే చేసుకోండి. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీలో భాగం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. పవన్ రాజకీయాల గురించి నాకు సంబంధం లేదు. ఏపీ పాలిటిక్స్ నాకు వద్దు. కానీ ఆయన ఇండస్ట్రీ గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటి గురించి చర్చించుకుందాం. కానీ నన్ను అనవసరంగా ఈ వివాదంలోకి ఎందుకు లాగుతున్నారు అని ప్రకాష్ రాజ్ విష్ణుని ప్రశ్నించారు. 

నాకు పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ కాదు. నాకు ఆయనకు సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. కానీ పవన్ ని ఇండస్ట్రీ నుంచి పక్కన పెట్టడానికి మీరు ఎవరు ? నన్ను లాగడానికి కారణం ఏంటి ? ఈ రాజకీయాలు ఏంటి ? అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. 

ఇదిలా ఉండగా బండ్ల గణేష్ జనరల్ సెక్రటరీ అభ్యర్థిగా నామినేషన్ ఉపసంహరించుకుని తిరిగి ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలపడం కొసమెరుపు. విష్ణు ప్రకాష్ రాజ్ గురించి చేసిన వ్యాఖ్యలు తనని కూడా కలచివేశాయని గణేష్ తెలిపాడు. పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీతో సంబంధం లేదు అన్నట్లుగా విష్ణు మాట్లాడడం బాధించింది అని గణేష్ తెలిపాడు. 

click me!