ఈరోజు ఎపిసోడ్ లో వేద ఎమోషనల్ అవుతూ ఉండగా బయట యష్ ఫుల్ గా తాగి వాచ్ మెన్ తో గొడవ పడుతూ నేను నా లైఫ్ ని స్పాయిల్ చేసుకున్నాను నన్ను వదిలేయరా అని మాట్లాడుతూ ఉంటాడు. వెళ్లి అందరిని నిద్ర లేపు అందరి బయటికి రావాలి అందరూ బయటికి రండి అంటూ తాగి యష్ గోల గోల చేస్తూ ఉంటాడు. అప్పుడు యష్ గొంతులా ఉంది అని బయటికి వెళ్లి చూడగా అక్కడ యష్ తాగి గొడవ చేస్తుండడంతో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది వేద. ఇప్పుడు వేద రండి వెళ్దాం అనగా నాకు ఎవరు వద్దు నాకు ఎవరు హెల్ప్ వద్దు అని అంటాడు.