స్టార్ కిడ్స్ వల్ల చాలా నష్టపోయా.. బాంబు పేల్చిన రకుల్

First Published | Sep 12, 2024, 1:31 PM IST

టాలీవుడ్ లో కొంతకాలం రకుల్ టాప్ హీరోయిన్ గా, హైయెస్ట్ పైడ్  నటీమణిగా కొనసాగింది. ఇప్పుడు రకుల్ ప్రభావం టాలీవుడ్ లో పూర్తిగా తగ్గింది. ఇటీవల రకుల్.. జాకీ భగ్నానికి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

టాలీవుడ్ లో కొంతకాలం రకుల్ టాప్ హీరోయిన్ గా, హైయెస్ట్ పైడ్  నటీమణిగా కొనసాగింది. ఇప్పుడు రకుల్ ప్రభావం టాలీవుడ్ లో పూర్తిగా తగ్గింది. ఇటీవల రకుల్.. జాకీ భగ్నానికి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో రకుల్ ప్రస్తుతం అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. 

Rakul Preet Singh

ఓ ఇంటర్వ్యూలో రకుల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ తో పాటు చాలా చిత్ర పరిశ్రమలో నెపోటిజం అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. రకుల్ దీని గురించి మాట్లాడింది. నేను కూడా నెపోటిజం వల్ల బాగా నష్టపోయాను. అయితే నా దృష్టిలో నెపోటిజం అనేది తప్పు కాదు. 


నాకు రావలసిన చాలా అవకాశాలు స్టార్ కిడ్స్ కి వెళ్లాయి. దీనివల్ల కెరీర్ లో బాగా నష్టపోయా. అయితే ఆ విషయంలో నాకు బాధ లేదు. ఎందుకంటే అది వాళ్ళకి రాసిపెట్టి ఉంది. స్టార్ కిడ్స్ కి అవకాశాలు సులభంగా వస్తాయి. అది వాళ్ళ తల్లిదండ్రులు చేసిన కష్టానికి ప్రతిఫలంగా నేను భావిస్తాను. కాబట్టి నెపోటిజం ఎక్కువ ఆలోచించను. 

భవిష్యత్తులో నా పిల్లలు చిత్ర పరిశ్రమలోకి రావాలంటే వాళ్ళకి నా సహకారం ఉంటుంది కదా అని రకుల్ తెలిపింది. రకుల్ ప్రీత్ సింగ్ నెపోటిజం పాజిటివ్ గా తీసుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

Latest Videos

click me!