బాలయ్యపై డూప్ క్రియేట్ చేసి మరీ సెటైర్లు.. కమెడియన్ కి వార్నింగ్ ఇవ్వకుండా ఎందుకు వదిలేశారో తెలుసా

First Published | Sep 12, 2024, 12:09 PM IST

ఒకసారి బాలయ్య విషయంలో సునీల్ టెన్షన్ పడ్డారట. సునీల్ కమెడియన్ గా సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత హీరోగా కూడా నటించారు. కానీ ఎక్కువ కాలం సునీల్ హీరోగా రాణించలేదు.

నందమూరి బాలకృష్ణ ముక్కుసూటి వ్యక్తిత్వం అని చాలా మంది అంటుంటారు. కోపం అయినా, సంతోషం అయినా దాచుకోవడం తెలియదు. దీనివల్ల కొన్నిసార్లు బాలయ్య విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. వివాదాస్పద అంశం అయినా కూడా బాలయ్యకి ఓపెన్ గా మాట్లాడడం అలవాటు. 

అయితే ఒకసారి బాలయ్య విషయంలో సునీల్ టెన్షన్ పడ్డారట. సునీల్ కమెడియన్ గా సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత హీరోగా కూడా నటించారు. కానీ ఎక్కువ కాలం సునీల్ హీరోగా రాణించలేదు. ఇప్పుడు తిరిగి క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. గతంలో సునీల్, రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అనే చిత్రం వచ్చింది. 

బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Sunil

ఈ చిత్రంలో వర్మ చాలా మంది స్టార్స్ పై, దర్శకులపై సెటైర్లు వేస్తూ సన్నివేశాలు చిత్రీకరించారు. చిత్రపరిశ్రమపై సెటైరికల్ గా ఈ చిత్రాన్ని వర్మ రూపొందించారు. ఈ చిత్రం వల్ల హీరోల నుంచి, ఫ్యాన్స్ నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటాయోమోనని సునీల్ కాస్త టెన్షన్ పడ్డారట. కానీ సునీల్ టెన్షన్ పడ్డట్లు ఏమీ జరగలేదు. పైగా కొంతమంది అభినందించారు అని తెలిపాడు. 

Also Read: నటి హేమకి మళ్ళీ షాక్.. రేవ్ పార్టీ సంఘటనలో దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు

Actor Sunil

ముఖ్యంగా ఈ చిత్రంలో బాలయ్య డూప్ కి సంబంధించిన సన్నివేశం ఉంది. బాలయ్య షూటింగ్ లో ఉండగా.. ఈ సినిమా హీరో ఎవరు అని సునీల్ అడగడం.. నేనే హీరో అన్ని బాలయ్య అంటే.. ఆహే నువ్వు హీరో ఏంటి.. మా ఫ్రెండ్ హీరో అని సునీల్ సెటైర్లు వేయడం లాంటి సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమా తర్వాత బాలయ్యని కలవడానికి సునీల్ కంగారు పడ్డారట. కొంతమంది ఆ సన్నివేశాల వల్ల హర్ట్ అయి ఉండొచ్చు. 

Actor Sunil

కానీ బాలయ్య ఈ చిత్రం గురించి ముందే తెలుసుకున్నారు. సునీల్ అనుకోకుండా బాలయ్యని కలిశారు. ఈ సినిమాలో మన గురించి ఏదో ఉందట కదా అని అడిగారు. ఆ డైలాగ్స్ చెప్పను. చాలా బావుందే అని అభినందించారు. సెటైర్ ని కూడా ఆయన అంత సరదాగా తీసుకుంటారని తాను ఊహించలేదని సునీల్ తెలిపారు. ఒక వేళ హర్ట్ అయి ఉంటే వార్నింగ్ ఇస్తారేమో అని అనుకున్నారట. 

Latest Videos

click me!