హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ నా కూతురి కష్టం, వాడెవడో ఇచ్చాడని అంటారా.. కట్టలు తెంచుకున్న రకుల్ తండ్రి ఆగ్రహం

First Published May 22, 2024, 4:36 PM IST

హీరోయిన్లపై రూమర్స్ వస్తూనే ఉంటాయి. రకుల్ కూడా కొన్ని రూమర్స్ కి ఇబ్బందులు ఎదుర్కొంది. ఒక రూమర్ అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెట్టిందట.

రకుల్ ప్రీత్ సింగ్ కి తిరుగులేదు అన్నట్లుగా ఒకప్పుడు ఆమె హవా సాగింది. కానీ ఇప్పుడు రకుల్ కి అవకాశాలు తగ్గాయి. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. 

రకుల్ ప్రీత్ సింగ్, రాంచరణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో నటించింది. కొంతకాలం రకుల్ టాలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎందుకునే స్థాయిలో కొనసాగింది. ఇటీవల కొత్త హీరోయిన్ల తాకిడితో రకుల్ ప్రభావం తగ్గింది. 

హీరోయిన్లపై రూమర్స్ వస్తూనే ఉంటాయి. రకుల్ కూడా కొన్ని రూమర్స్ కి ఇబ్బందులు ఎదుర్కొంది. టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన సమయంలో రకుల్ పేరు కూడా విపించింది. కానీ ఆ తర్వాత ఆ కేసు నిలబడలేదు. 

ఒక రూమర్ అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెట్టిందట. రకుల్ ఒక సందర్భంలో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో వచ్చే రూమర్స్ గురించి నాకు తెలుసు. వాస్తవం కాకపోయినా ఏదో ఒకటి సృష్టిస్తూ ఉంటారు. మా నాన్నకి కూడా కొంత తెలుసు. కానీ ఒక్కో సారి విచిత్రమైన రూమర్స్ క్రియేట్ చేస్తే సహజంగా కోపం వస్తుంది. 

నేను హైదరాబాద్ లో ఒక లగ్జరీ హౌస్ కొన్నా. నేను నటిగా జీరో నుంచి ప్రారంభించి కష్టపడి ఎన్నో చిత్రాల్లో నటించా. ఆయా డబ్బులు సేవ్ చేసుకుని ఇల్లు కొనుక్కున్నా. రకుల్ హైదరాబాద్ లో ఉన్న హౌస్ ధర 3 కోట్ల వరకు ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. నా కష్టంతో ఆ ఇల్లు కొనుక్కుంటే ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చారని పుకార్లు పుట్టించారు. 

ఆ సమయంలో మా నాన్న ఢిల్లీలో ఉన్నారు. నా సంపాదన గురించి, నా కష్టం గురించి మా నాన్నకి మొత్తం తెలుసు. ఒక బడా సెలెబ్రిటీ రకుల్ కి లగ్జరీ హౌస్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ న్యూస్ గురించి మా నాన్నకి తెలిసింది. వెంటనే నా మేనేజర్ కి నాన్న ఫోన్ చేసి కోపంగా అరిచేశారు. 

ఆ ఇల్లు నా కూతురి కష్టం అయితే వాడెవడో ఇచ్చారని అంటారా ? అసలేం వార్తలు అవి అంటూ మేనేజర్ ని తిట్టేశారు. నేను ఫోన్ తీసుకుని ఇక్కడ అంతే నాన్న.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పా. 

Latest Videos

click me!