మరో స్టార్‌ హీరో సినిమాలో మంచు మనోజ్‌?.. అలసిపోయిన దశలో సంచలన నిర్ణయం..?

First Published May 22, 2024, 1:27 PM IST

మంచు మనోజ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. హీరో నుంచి విలన్‌గా టర్న్ తీసుకున్నాడు. అంతేకాదు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 
 

మంచు హీరోల కెరీర్‌ ఆశించిన స్థాయిలో విజయవంతంగా సాగడం లేదు. ప్రారంభంలో మెప్పించిన వీరు ఆ తర్వాత స్ట్రగుల్‌ అయ్యాయి. సక్సెస్‌ లేని దశలో సినిమాలు చేయాలా? వద్దా అనే పరిస్థితి వచ్చింది. అయితే అన్న మంచు విష్ణు ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నారు. తమ్ముడు మంచు మనోజ్‌ గతేడాది హీరోగా ఓ సినిమాని ప్రకటించారు. కానీ అది పట్టాలెక్కలేదు.  

చాలా రోజులుగా మంచు మనోజ్‌ హీరోగా సినిమాల కోసం వెయిట్‌ చేస్తున్నాడు. రెండో పెళ్లి తర్వాత అయినా సినిమాల పరంగా కలిసొస్తుందని భావించినా ప్రయోజనం లేదు. మంచి ఆఫర్ల కోసం వెచి చూశాడు, అయినా ప్రయోజనం లేదు. హీరోగా సినిమాలు పట్టాలెక్కే పరిస్థితి లేదు. వెయిట్‌ చేశాడు, అలసిపోయాడు. ఈ క్రమంలో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నాడు. విలన్‌గా టర్న్ తీసుకున్నాడు. 
 

ప్రస్తుతం `మిరాయ్‌` చిత్రంలో మంచు మనోజ్‌ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. తన బర్త్ డే సందర్భంగా మనోజ్‌ పాత్ర గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో మంచు మనోజ్‌ లుక్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉందని గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ఆయన యాక్షన్‌ లుక్‌ కూడా అదిరిపోయింది. విలన్‌ పాత్ర అయినా హీరోకి ఏమాత్రం తక్కువగా ఉండదని అర్థమవుతుంది. తేజా సజ్జ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. 
 

ఈ క్రమంలో మంచు మనోజ్‌ మరో సినిమాకి సైన్‌ చేశాడట. విలన్‌గానే కాదు, బలమైన పాత్ర ఎలాంటిదైనా చేసేందుకు ఆయన రెడీ అవుతున్నాడట. వెంకటేష్‌ సినిమాకి ఓకే చెప్పారట. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్‌ ఓ సినిమా చేస్తున్నారు. అనిల్‌ రావిపూడి, వెంకీ మార్క్ వినోదంతో ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఇందులో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరీని అనుకున్నారట. అయితే ఈ మూవీలో కీలక పాత్ర కోసం మంచు మనోజ్‌ని తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ మూవీలో ఓ బలైమన పాత్రకి, సెకండ్‌ హీరో లాంటి పాత్రకి ఆయన ఓకే చెప్పినట్టు సమాచారం. 
 

ఈ మూవీ థ్రిల్లర్‌ ప్రధానంగా సాగే యాక్షన్ డ్రామా అని, వెంకటేష్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తారని, తన మాజీ లవర్‌కి, భార్యకి మధ్య నలిగిపోయే పాత్రలో వెంకీ కనిపిస్తారని సమాచారం. ఇందులో మరో బలమైన పాత్రలో మంచు మనోజ్‌ కనిపిస్తారట. ఇక ఈ మూవీని దిల్‌ రాజు నిర్మిస్తుండగా జులై నుంచి షూటింగ్‌ ప్రారంభించబోతున్నారు. మొత్తంగా మంచు మనోజ్‌ హీరోగా సినిమాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మారినట్టు తెలుస్తుంది. 

Latest Videos

click me!