రకుల్‌ కలలు కనే రాత్రి.. పెళ్లి పార్టీలో భర్తతో స్టార్‌ హీరోయిన్ రచ్చ.. మతిపోయే ఔట్‌ఫిట్‌

First Published | Feb 25, 2024, 12:46 PM IST

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మూడు రోజుల క్రితమే పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు జాకీ భగ్నానీని ఆమె వివాహమాడిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె తన డ్రీమ్‌ రాత్రిని పూర్తి చేసుకుంది. 
 

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానని ఈ గురువారం గోవాలో చాలా గ్రాండ్‌గా మ్యారేజ్‌ చేసుకుంది. పర్యావరణ హితంగా వీరి వివాహ వేడుక జరగడం విశేషం. శనివారం రాత్రి పెళ్లి పార్టీలో పాల్గొంది. ఇందులో తన భర్తతో కలిసి పాల్గొని బంధుమిత్రులను ఎంటర్‌టైన్‌ చేశారు. 
 

ఈ పార్టీలో అదిరిపోయే ఔట్‌ఫిట్‌లో మెరిసింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ప్రముఖ డిజైనింగ్‌ సంస్థ ఫాల్గుని పికాక్‌ రూపొందించిన డిజైనింగ్‌ వేర్‌లో మెరిసింది. ఇందులో రకుల్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అందరి చూపు తనవైపు తిప్పుకుని కొత్త పెళ్లి కూతురు అనిపించుకుంది. 
 


ఇక డార్క్ బ్లూ కోట్‌ ధరించి మరింత ఎట్రాక్ట్ చేస్తున్నారు జాకీ భగ్నానీ. కానీ రకుల్‌ ముందు తేలిపోయాడని చెప్పొచ్చు. పెళ్లి పార్టీలో ఈ కొత్త సందడి చేసింది. పార్టీని ప్రత్యేకంగా మార్చేసింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది రకుల్‌. 

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. పెళ్లి పార్టీ సందర్భంగా దిగిన ఫోటో షూట్‌ పిక్స్ ని సైతం షేర్‌ చేసుకుంది. చూడ్డానికి రకుల్‌ అందాల రాజహంసలా మెరిసిపోతుంది. ఆమెలో పెళ్లి కళ ఓవర్‌ ఫ్లో అవుతుంది. అంతేకాదు రకుల్‌ ఆనందానికి అవదుల్లేవ్. కోరుకున్న వాడు భర్తగా వస్తే అమ్మాయిల్లో ఆ సంతోషమే వేరు, ఇప్పుడు రకుల్‌ కూడా అలాంటి సంతోషాన్ని పొందుతుంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆ సంతోషం కనిపిస్తుంది. అలా రకుల్‌, జాకీల పెళ్లి చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. 
 

ఇక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మూడేళ్ల క్రితమే బాలీవుడ్‌లోకి చెక్కేసింది. తెలుగు సినిమాలు మానేసి హిందీకే పరిమితమయ్యింది. అక్కడ వరుసగా పది సినిమాల్లో మెరిసింది. జయాపజయాలకు అతీతంగా ఆఫర్లని అందుకుని ముందుకు సాగింది. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. 
 

ఈ క్రమంలో బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది. చాలా కాలంగా ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రియుడి కోసమే బాలీవుడ్‌కి చెక్కేసిందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ తనకు మాత్రం అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. ఇప్పుడు ఏకంగా పెళ్లి కూడా చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అయ్యింది. 
 

ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ `ఇండియన్‌ 2`లో నటిస్తుంది. `మేరీ పత్నీ కా రీమేక్‌` చిత్రంలోనూ నటిస్తుంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది రాబోతున్నాయి. కొత్తగా రకుల్ మరే మూవీకి సైన్‌ చేయలేదు. దీంతో ఈ బ్యూటీ ఇక సినిమాలు మానేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై మున్ముందు క్లారిటీ రానుంది. 
 

Latest Videos

click me!