నాని సినిమాల లైనప్‌ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే.. ప్రభాస్‌ని మించిపోతున్నాడుగా..

Published : Feb 25, 2024, 10:31 AM IST

నేచురల్‌ స్టార్‌ నాని ప్రస్తుతం టాలీవుడ్‌లో బిగ్‌ డీల్‌గా మారుతున్నాడు. ఆయన సినిమాల లైనప్‌ అదిరిపోయేలా ఉంది. చూడబోతుంటే ఆయన ప్రభాస్‌నే మించిపోయేలా ఉన్నాడు.

PREV
18
నాని సినిమాల లైనప్‌ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే.. ప్రభాస్‌ని మించిపోతున్నాడుగా..

నేచురల్‌ స్టార్‌ నాని ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చాడు. ఆర్జే నుంచి నెమ్మదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ని ప్రారంభించి హీరోగా టర్న్ తీసుకుని ఇప్పుడు టైర్‌2 హీరోగా ఎదిగాడు. సూపర్‌ స్టార్‌ దిశగా అడుగులు వేస్తున్నారు. తన రేంజ్‌ హీరోల్లో ఎవరికి సాధ్యం కాని విధంగా ఆయన సినిమాలు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు. ఇప్పుడు నాని రేంజ్‌ నెక్ట్స్ లెవల్‌ కి వెళ్తుందని చెప్పొచ్చు. 

28

నాని లైఫ్‌ని టర్న్ తిప్పిన మూవీ `దసరా`. అంతకు ముందు ఐదారేళ్లుగా అదే స్థానంలో స్ట్రగుల్‌ అవుతున్నాడు. ఆయన సినిమాలు హిట్‌ అవుతున్నా, బాక్సాఫీసు వద్ద కొంత వరకు వెళ్లి ఆగిపోతున్నాయి. నెక్ట్స్ లెవల్‌కి వెల్లడం లేదు. దీంతో `దసరా` మూవీ ఆయనకు గేమ్‌ ఛేంజర్‌గా నిలిచింది. ఈ మూవీ సుమారు వంద కోట్ల వరకు వెళ్లింది. తనకు పాన్‌ ఇండియా మార్కెట్‌ని పరిచయం చేసింది. ఆ తర్వాత వచ్చిన `హాయ్‌ నాన్న` కి నెగటివ్‌ టాక్‌ వచ్చినా ఈ మూవీ వంద కోట్ల దగ్గరకు వెళ్లింది. కారణం పాన్‌ ఇండియా మార్కెట్‌, పెరిగిన నాని మార్కెట్‌. 

38

ఇప్పుడు నాని చేస్తున్న సినిమాలు నెక్ట్స్ లెవల్‌లో ఉంటున్నాయి. తాజాగా ఆయన పుట్టిన రోజు సందర్బంగా శనివారం విడుదలైన `సరిపోదా శనివారం` మూవీ టీజర్‌ అదిరిపోయేలా ఉంది. నాని మాస్‌ ని మరో స్థాయిలో చూపించారు క్లాస్ డైరెక్టర్‌ వివేక్‌ ఆత్రేయ. మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీ ఆగస్ట్ ఎండింగ్‌లో రాబోతుంది. 

48

నాని నెక్ట్స్ మూవీస్‌ లైనప్‌ చూస్తే మాత్రం అదిరిపోయేలా ఉంది. భారీ సినిమాలతో నెక్ట్స్ లెవల్‌ షో చేయబోతున్నారు. ఆయన లైనప్‌లో ఐదారు సినిమాలుండటం విశేషం. అవేంటో చూస్తే, ప్రస్తుతం వివేక్ ఆత్రేయతో `సరిపోదా శనివారం` చేస్తున్నారు. ఇది పాన్‌ ఇండియా మూవీ. నానిలోని మరో మాస్‌ యాంగిల్‌ని ఇందులో చూపించబోతున్నారు. 
 

58

అలాగే `ఓజీ` ఫేమ్‌ సుజీత్‌తో కొత్త సినిమాని ప్రకటించారు. `నాని 32`గా ఇది తెరకెక్కబోతుంది. పవన్‌తో `ఓజీ` షూటింగ్‌ అయిపోయిన తర్వాత ఈ మూవీ తెరకెక్కబోతుంది.

68

అలాగే `బలగం` ఫేమ్‌ వేణు ఎల్దండితో సినిమా చేయబోతున్నారు. `ఎల్లమ్మ` అనేటైటిల్‌ అనుకుంటున్నారు. దిల్‌రాజు దీన్ని నిర్మించనున్నారు. నాని బర్త్ డే సందర్భంగా వీళ్లు నానిని కలిసి విషెస్‌ తెలిపారు. ఈ ఫోటో వైరల్‌ అవుతుంది. 

78

దీంతోపాటు `దసరా` ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓడెలతో మరో సినిమా కమిట్‌మెంట్‌ ఉంది. శ్రీకాంత్‌ ఇప్పటి వరకు కొత్త సినిమాని ప్రకటించలేదు. మళ్లీ ఆయన నానితోనే చేయాలని భావిస్తున్నారట. అలాగే నానితో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కూడా సినిమా చేసే అవకాశం ఉందట. ఆ మధ్య దీనిపై వార్తలు వైరల్‌ అయ్యాయి. అంతేకాదు తమిళ దర్శకులు కూడా క్యూలో ఉన్నారట. కార్తిక్‌ సుబ్బరాజు, సిబి చక్రవర్తి వంటి వారు కూడా నానితో డిస్కషన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. 
 

88

ఇలా చూస్తుంటే ఇప్పుడు నాని కమిట్‌ అయిన సినిమాలే ఐదు ఉన్నాయి. మరో మూడు చర్చల్లో ఉన్నాయి. ఇలా ఏడెనమిది సినిమాల లైనప్‌ తో దాదాపు రెండు మూడేళ్ల వరకు బిజీగా ఉన్నారని చెప్పొచ్చు. ప్రభాస్‌ చేతిలోనూ `కల్కి`, `రాజాసాబ్‌`, `స్పిరిట్‌`, `సలార్‌ 2`, హను రాఘవపూడి మూవీ, ప్రశాంత్‌ నీల్‌ మూవీ, అలాగే బోయపాటితో చర్చల్లో మరో సినిమాతో టాప్‌ లో ఉండగా, తాజాగా నాని ప్రభాస్‌ని మించిపోయేలా ఉన్నాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు నెక్ట్స్ రెండుమూడేళ్లలో నాని టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తారని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories