ర్యాంప్‌పై రకుల్‌ కిర్రాక్‌ లుక్‌.. మెరుపుల్లాంటి డ్రెస్‌లో హాట్‌ బ్యూటీ స్టన్నింగ్‌ పోజులు అదరహో

Published : Apr 26, 2023, 05:31 PM ISTUpdated : Apr 26, 2023, 07:26 PM IST

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ముంబయిలో మెరుస్తూ అక్కడి ఆడియెన్స్ ని అలరిస్తుంది. నార్త్ ఆడియెన్స్ టార్గెట్‌గా ముందుకు సాగుతుంది. కానీ ఈ బ్యూటీ నయా ఫోటోలు మాత్రం సౌత్‌లో అలజడి సృష్టిస్తున్నాయి.   

PREV
17
ర్యాంప్‌పై రకుల్‌ కిర్రాక్‌ లుక్‌.. మెరుపుల్లాంటి డ్రెస్‌లో హాట్‌ బ్యూటీ స్టన్నింగ్‌ పోజులు అదరహో

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తాజాగా మెరుపుల లాంటి డ్రెస్‌ ధరించింది. ఒంటికి మెరుపుల గ్లాసెస్ అద్దినట్టుగా ఉన్న డ్రెస్‌ ధరించింది. ర్యాంప్‌పై హోయలు పోతూ అలరించింది. ఈ సందర్బంగా దిగిన ఫోటోలను ఇస్టా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంది. 

27

ఇటీవల ముంబయిలో జరిగిన టైమ్స్ ఫ్యాషన్‌ వీక్‌లో రకుల్‌ సందడి చేసింది. ఈ ఫోటోలను ఇప్పటికే పంచుకుని ఆకట్టుకుంది. తాజాగా మరోసారి ఆయా అందాల చిత్రాలను షేర్‌ చేసింది. ర్యాంప్‌ పై దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది రకుల్‌. ఇందులో ఆమె పోజులు మతిపోగొట్టేలా ఉన్నాయి. 

37

రకుల్‌ ఈ నయా ఫోటోలు ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. దీనిపై ఫ్యాన్స్, నెటిజన్లు రియాక్ట్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు. సన్నింగ్‌ పోజులు అదరహో అని, మోస్ట్ ఐకానిక్‌ హీరోయిన్‌ అని, నయా ఫ్యాషన్‌ దుస్తుల్లో రకుల్‌ ఏక్‌ ధమ్‌ ఉందని అంటున్నారు.

47

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. అయితే గతంతో పోల్చితే ఆమె జోరు తగ్గినట్టుగా అనిపిస్తుంది. గతేడాది ఏకంగా ఐదు సినిమాలతో మెరిసింది. అంతకు ముందు కూడా రెండు మూడు సినిమాలతో ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు ఆమె చేతిలో రెండు సినిమాలే ఉన్నాయి. 

57

అయితే బాలీవుడ్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్‌ అయ్యాయి. ఒక్క చిత్రం కూడా సక్సెస్‌ కాలేదు. `దేదే ప్యార్‌ దే`, `ఛత్రివాలి`ఫర్వాలేదనిపించుకున్నాయి. మిగిలిన సినిమాలు పరాజయం చెందాయి. దీంతో ఈ బ్యూటీని మేకర్స్ పక్కన పెట్టారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

67

ఏ ఇండస్ట్రీలోనైనా సక్సెస్‌ వెంటే పరిగెడతారు. సక్సెస్‌ ఎక్కడ ఉంటే అక్కడే డిమాండ్‌ ఉంటుంది. కానీ రకుల్‌ సక్సెస్‌ లేకపోయినా అవకాశాలు అందుకుంది. అయితే గ్లామర్‌ పాత్రలకు జయాపజయాలకు సంబంధం లేదు. స్టార్‌ హీరోల సరసన కాసేపు మెరిసే హీరోయిన్‌ పాత్రలకు విజయాలతో సంబంధం లేకుండా ఆఫర్లు వస్తుంటాయి. 
 

77

రకుల్‌ అలానే పొందిందా అనేది సందేహం. ఇప్పుడు ఆ ప్రభావం ఈ బ్యూటీకి స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. మరి నిజంగానే కొత్త అవకాశాలు రావడం లేదా? ప్రస్తుతం ఏవైనా చర్చల దశలో ఉన్నాయా? అసలేం జరుగుతుందనేది మాత్రం రకుల్‌కే తెలుసు. దీనిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories