RRR, బాహుబలి ఎలా హిట్ అయ్యాయో తెలియదు.. శాకుంతలం ఎందుకు ఫ్లాపో అర్థం కావడం లేదు: నటి మధుబాల

Published : Apr 26, 2023, 04:43 PM IST

రోజా, జెంటిల్ మాన్ చిత్రాల నటి మధుబాల అప్పుడప్పుడూ తెలుగు ప్రేక్షకులని పలకరిస్తున్నారు. రీసెంట్ గా మధుబాల శాకుంతలం చిత్రంలో కీలక పాత్రలో నటించారు. 

PREV
16
RRR, బాహుబలి ఎలా హిట్ అయ్యాయో తెలియదు.. శాకుంతలం ఎందుకు ఫ్లాపో అర్థం కావడం లేదు: నటి మధుబాల

రోజా, జెంటిల్ మాన్ చిత్రాల నటి మధుబాల అప్పుడప్పుడూ తెలుగు ప్రేక్షకులని పలకరిస్తున్నారు. రీసెంట్ గా మధుబాల శాకుంతలం చిత్రంలో కీలక పాత్రలో నటించారు. సమంత లీడ్ రోల్ నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై పరాజయాన్ని మూటగట్టుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ కి ఏమాత్రం ఎక్కలేదు. 

26

ఈ మూవీలో మధుబాల శకుంతల తల్లిగా అప్సరస మేనక పాత్రలో నటించారు. శాకుంతలం చిత్రం ఫెయిల్యూర్ పై తొలిసారి ఆమె స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మధుబాల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నారు. 'శాకుంతలం' చిత్రం ఎందుకు ఫ్లాప్ అయిందో అర్థం కావడం లేదు. ఆ చిత్రం సరిగా ఆడలేదని తెలిసి చాలా బాధపడ్డా. 

36

ఎందుకంటే నిర్మాతలు, దర్శకుడు, టెక్నీషియన్స్, నటీనటులు అందరూ ఎంతో కష్టపడ్డారు. చేయాల్సిందంతా చేశారు. ప్రీ ప్రొడక్షన్ నుంచి రిలీజ్ వరకు దర్శకుడు, నిర్మాతలు ఉన్న ప్రతి చిన్న అవకాశాన్ని ప్రయత్నించారు. ఈ చిత్రం కోసం వాళ్ళ బెస్ట్ అందించారు. విజువల్ ట్రీట్ అందించేందుకు సిజి వర్క్ కోసం 6 నెలలు కష్టపడ్డారు. వాళ్ళు దేనిని గ్రాంటెడ్ గా తీసుకోలేదు. 

 

46

ఈ చిత్రం కోసం ఏ ఒక్కరూ వత్తిడితో పనిచేయలేదు. టెక్నీషియన్లను అవసరమైన ఫ్రీడమ్ ఇచ్చారు. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎందుకు క్లిక్ కాలేదో అర్థం కావడం లేదు. మరోవైపు బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అసలు ఆ చిత్రాలు ఎందుకు హిట్ అయ్యాయో తెలియదు. ఆ చిత్రాల విజయాలకు కారణాలు ఏంటో ఎవ్వరూ చెప్పలేరు అని మధుబాల ఆసక్తికర చేశారు. 

56

ఆర్ఆర్ఆర్, బాహుబలి తరహాలోనే శాకుంతలం చిత్రం కంప్లీట్ గా సౌత్ ఇండియన్ ఫ్లేవర్ లో తెరకెక్కింది. పైగా ఇది పురాణాలకు చెందిన కథ. అయినప్పటికీ ఈ చిత్రం వర్కౌట్ కాలేదు. ఈ లాజిక్ ఏంటో తెలియడం లేదు అని మధుబాల నిట్టూరుస్తూ మాట్లాడారు. 

66

శాకుంతలం చిత్ర ఈ రిజల్ట్ ని తాను ఊహించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. సమంత తొలిసారి పౌరాణిక చిత్రంలో నటించడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చితం మ్యాజిక్ చేస్తుందని అంచనాలు కూడా వినిపించాయి. కానీ కథ కథనం నెమ్మదిగా సాగడం, విఎఫెక్స్ సరిగా లేకపోవడం లాంటి కారణాలతో ఈ చిత్రం బోల్తా కొట్టింది.  

click me!

Recommended Stories