సమంతకు గుడి కడుతున్న వీరాభిమాని.. ఆకర్షణీయంగా సామ్ విగ్రహం.. ఎక్కడంటే?

First Published | Apr 26, 2023, 4:59 PM IST

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఫ్యాన్ పాలోయింగ్  ఏరేంజ్లో ఉంటుందో తెలిసిందే.  అయితే సామ్ కోసం ఓ డైర్డ్ హార్డ్ ఫ్యాన్ ఏకంగా గుడి కట్టిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. డిటేయిల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు దేశ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలకు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న సామ్ కు  డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారనే విషయం మరోసారి రుజువైంది. సమంత కోసం పడి చచ్చేంత అభిమానం వారిదని తేలిపోయింది.
 

‘యశోద’ చిత్రం రిలీజ్ సమయంలో సమంత కోసం అభిమానులు ఏకంగా థియేటర్ల వద్ద భారీ కటౌట్స్ కట్టారు. హీరోయిన్లలో ఎవరికీ లేని క్రేజ్ సామ్ కు దక్కింది. సమంత సినిమాలు, ఆమె ఆరోగ్యం విషయమైన ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలుస్తుంటారు. 
 


ఇక తాజాగా సమంతకు ఓ డైహార్డ్ ఫ్యాన్ ఏకంగా గుడినే కట్టిస్తున్నాడు. దైవంతో సమానంగా చూస్తూ సమంతపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు.   ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో గల ఆలపాడుకు చెందిన సందీప్ అనే యువకుడు సమంతకు వీరాభిమాని. రెండురోజుల్లో (April 28) సమంత బర్త్ డే ఉండటంతో సందీప్ తన అభిమానాన్ని చాటుకునేందుకు ఇంటిలోనే సమంతకు గుడి కట్టిస్తున్నాడు. ఇందుకోసం సమంత విగ్రహాన్ని కూడా తయారు చేయించాడు. 
 

సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్నందుకు తిరుపతి, చెన్నై, నాగపట్నం, కడపలోని ఫేమ్ దర్గాను కూడా  సందర్శించారు. తన మెక్కులు చెల్లిస్తూ యాత్ర కూడా నిర్వహించాడు సందీప్. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. గతంలో ఖుష్బూ సుందర్, నిధి అగర్వాల్, నమిత. నయనతారకు గుడి కట్టించి అభిమానాన్ని చాటుకున్నారు. 
 

రీసెంట్ గా సమంత ‘శాకుంతలం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆశించిన మేర ఈ చిత్రం ఫలితానివ్వలేకపోయింది. ఏదేమైనా మళ్లీ విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ‘ఖుషీ’తో అలరించేందుకు సిద్ధం అవుతోంది.  మరోవైపు క్రేజీ సిరీస్ ‘సిటడెట్’ ఇండియన్ వెర్షన్ లోనూ నటిస్తోంది. 

Latest Videos

click me!