గ్రాండ్ గా రకుల్ ప్రీత్ బర్త్ డే సెలబ్రేషన్స్... క్యూట్ ఫోటోలతో విష్ చేసిన ‘అఖండ’ హీరోయిన్

First Published | Oct 10, 2023, 2:43 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను పంచుకోగా.. ‘అఖండ’ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ క్యూట్ ఫొటోలతో రకుల్ ను విష్ చేసింది.
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఖతార్ కు ఓ ఈవెంట్ కోసం వెళ్లిన ఈ ముద్దుగుమ్మ అక్కడే కేక్ కట్ చేసినట్టు తెలుస్తోంది. తన భాయ్ ఫ్రెండ్ కూడా వేడుకకు హాజరై సందడి చేశారు. 
 

రకుల్ ప్రీత్ సింగ్ 1990 అక్టోబర్ 10న పంజాబీ ఫ్యామిలీలో జన్మిచింది. న్యూ ఢిల్లీకి చెందిన కుల్విందర్ సింగ్ - రాజేందర్ కౌర్ దంపతులకు జన్మించింది. తండ్రి ఆర్మీ ఆఫీసర్. దీంతో రకుల్ చదువు కూడా ఆర్మీ స్కూల్ లోనే జరిగింది. ఆమె సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు. 
 


నేటితో రకుల్ 33వ యేటా అడుగుపెట్టింది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. ఇక సెలబ్రెటీలు సైతం ఆమెతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నారు. 

ఈ సందర్భంగా ‘అఖండ’ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) రకుల్ ను స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపింది. రకుల్, ప్రగ్యా కలిసి ఉన్న కొన్ని ఫొటోలను పంచుకుంది. క్యూట్ ఫొటోల్లో బర్త్ డే గర్ల్ బ్యూటీఫుల్ గా మెరిసింది. ఆ ఫొటోలు నెటిజన్లనూ ఆకట్టుకుంటున్నాయి. 
 

ఈ ఫొటోలను పంచుకుంటూ.. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు రకుత్ ప్రీత్ సింగ్. నీలాంటి వారు ఎవరూ లేరు. సంతోషంగా, మరింత సానుకూలమైన శక్తిని కలిగి ఉండటం నీలో ఉత్తమమైనది. మరింత ప్రేమ, అదృష్టం, ఆనందంతో పాటు నీవు కోరుకున్న ప్రతితి దక్కాలని  కోరుకుంటున్నాను.’ అంటూ స్పెషల్ గా విష్ చేసింది. 
 

ఇక రకుల్ ప్రీత్ సింగ్ మొన్నటి వరకు బాలీవుడ్ సందడి చేసింది. గతేడాది వరుస చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ పెద్దగా హిట్ పడలేదు. ఇదిలా ఉంటే.. మళ్లీ సౌత్ సినిమాలపై దృష్టి పెట్టింది రకుల్. ప్రస్తుతం కమల్ హాసన్ ‘ఇండియన్ 2’, శివకార్తికేయన్ ‘ఆయలాన్’ చిత్రాల్లో నటిస్తోంది.

Latest Videos

click me!