ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ జూన్ 18న అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. వడదెబ్బ వల్ల ఆయన ఆరోగ్యం దెబ్బ తినిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రక్త విరేచనాలు ఎక్కువ కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పది రోజుల క్రితం రాకేష్ మాస్టర్ మృతి చెందారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ జూన్ 18న అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. వడదెబ్బ వల్ల ఆయన ఆరోగ్యం దెబ్బ తినిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రక్త విరేచనాలు ఎక్కువ కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పది రోజుల క్రితం రాకేష్ మాస్టర్ మృతి చెందారు. రీసెంట్ గా రాకేష్ మాస్టర్ పది రోజుల కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి రాకేష్ మాస్టర్ శిష్యులు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ హాజరయ్యారు.
26
అయితే కొరియోగ్రాఫర్ గా ఎంతో ప్రతిభావంతుడుడైన రాకేష్ మాస్టర్ పరిస్థితి ఎలా ఎందుకు అయింది అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాకేష్ మాస్టర్ మద్యానికి బానిసయ్యాడని, మతిస్థితిమితం కోల్పోయాడని అనేక రూమర్స్ ఉన్నాయి.
36
రాకేష్ మాస్టర్ చివరగా మాట్లాడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాకేష్ మాస్టర్ ఆ వీడియోల్లో చాలా నీరసంగా మాట్లాడుతున్నారు. అప్పటికే రాకేష్ మాస్టర్ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నట్లు అర్థం అవుతోంది. రాకేష్ మాస్టర్ ఈ వీడియోలో అసలు సంబంధం లేకుండా నీరసంగా మాట్లాడుతున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నట్లు చెప్పారు.
46
వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు లని తిడుతూ కొన్ని కామెంట్స్ చేశారు. అయితే రాకేష్ మాస్టర్ మూడవ భార్యగా చలామణి అయిన లక్ష్మి గురించి కూడా పరోక్షంగా ఈ వీడియోలో కామెంట్స్ చేసినట్లు అర్థం అవుతోంది. అది నా భార్యని తిట్టింది, కొడుకుని, నా కూతుర్ని తిట్టింది అంటూ బాధపడ్డారు. ఆమెని కూడా నేను తిట్టాను అని అన్నారు. తాను ప్రస్తుతం మందులో లేనని.. నీరసంగా ఉన్నానని రాకేష్ మాస్టర్ తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. రాకేష్ మాస్టర్ ఇలాంటి స్థితిలో మాట్లాడడం చూస్తున్న అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.
56
Rakesh Master
రాకేష్ మాస్టర్ తన చివరి వీడియోలో కూడా భార్య, పిల్లలనే తలుచుకుంటున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాకేష్ మాస్టర్ ఆంధ్ర మద్యం సేవించడం వల్ల అనారోగ్యానికి గురయ్యారని.. మరికొందరు రాకేష్ మాస్టర్ యాసిడ్ తాగారని కూడా రూమర్స్ వచ్చాయి. అయితే ఈ వీడియోలో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ తాను మంచి నీళ్లు మాత్రమే తాగానని అన్నారు.
66
90వ దశకం చివర్లో కెరీర్ మొదలు పెట్టిన రాకేష్ మాస్టర్.. రవితేజ, మహేష్ బాబు, రామ్ పోతినేని, వేణు లాటి క్రేజీ హీరోలందరికీ కొరియోగ్రఫీ అందించారు. దేవదాసు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతారామరాజు లాంటి హిట్ చిత్రాలకు పనిచేశారు.