అర్థరాత్రి వరకు అక్కడే.. నిద్ర లేక అనసూయ ఎలా అయిపోయిందో చూడండి... సుకుమార్‌కి ఇది న్యాయమా?

Published : Jun 29, 2023, 07:13 PM IST

హాట్‌ యాంకర్‌ అనసూయ.. ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉంది. ఆమె టీవీ షోస్‌ వదిలేసి సినిమాలపైనే ఫోకస్‌ పెట్టింది. అయితే సినిమా షూటింగ్‌లతో నిద్ర లేకుండా గడుపుతుందీ హాట్‌ యాంకర్‌. తన బాధలను అభిమానులతో పంచుకుంటుంది.   

PREV
17
అర్థరాత్రి వరకు అక్కడే.. నిద్ర లేక అనసూయ ఎలా అయిపోయిందో చూడండి... సుకుమార్‌కి ఇది న్యాయమా?

అనసూయ భరద్వాజ్‌.. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో పెద్ద సినిమా `పుష్ప2`. ఇది గత కొన్ని రోజులుగా కంటిన్యూగా చిత్రీకరణ జరుగుతుంది. ఇప్పటికే చాలా లేట్‌ అయిన నేపథ్యంలో ఇక గ్యాప్‌ లేకుండా షూట్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తుంది. ప్రధాన తారాగణం ఇందులో పాల్గొంటుందట. 
 

27

`పుష్ప2` షూటింగ్‌  ఇప్పుడు ఎక్కువగా నైట్‌లో జరుగుతుందట. ఈ షూటింగ్‌లో అనసూయ పాల్గొంటుందట. తాజాగా ఆమె తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించింది. అంతేకాదు తాను ఎంత బాధ పడుతుందో కూడా వెల్లడించింది. అర్థ రాత్రి వరకు షూటింగ్‌ జరుగుతుందని చెప్పింది అనసూయ. ఈ మేరకు ఆమె అర్థ రాత్రి ఏ టైమ్‌ అయ్యిందో కూడా తన పోస్ట్ లో వెల్లడించింది. 
 

37

ఇందులో అనసూయ దాక్షాయణి పాత్రలో కనిపించబోతుంది. ఆమెది పూర్తి నెగటివ్‌ రోల్‌. సునీల్‌ భార్యగా నటిస్తుంది. తన తమ్ముడిని చంపిన పుష్పరాజ్‌పై పగ తీర్చుకునేందుకు రగిలిపోయే పాత్ర ఆమెది. `పుష్ప2`లో మెయిన్‌గా ఉంటుందని సమాచారం. కట్‌ చేసిన జుట్టు, పట్టు చీర, చేతులకు బంగారు గాజులు, నోట్లో ఎప్పుడూ కిల్లీ నములుతూ ఉంటుంది దాక్షాయణి(అనసూయ). 
 

47

ఇప్పుడు ఆమె పంచుకున్న లేటెస్ట్ ఫోటోలోనూ అదే లుక్‌లో కనిపిస్తుంది. అయితే దాన్ని కొద్దిగే చూపించింది అనసూయ. అసలు లుక్‌ని దాచేసింది. మరోవైపు 3.16 నిమిషాలకు దిగిన మరో ఫోటోని ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ఇందులో అనసూయ బాగా వాడిపోయి, అలసిపోయి కనిపిస్తుంది. నైట్‌ షూటింగ్‌తో బాగా అలసిపోతున్నట్టు, నిద్ర కూడా ఉండటం లేదనే విషయాన్ని అనసూయ తన పోస్ట్ ల ద్వారా వెల్లడించింది. 
 

57

అయితే దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. నిద్ర లేక అనసూయ ఎలా అయిపోయిందో చూడండి అని, పాపం అనసూయ పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది?, ఎలాంటి అందం ఎలా అయిపోయిందని, సుకుమార్‌ మీకిది న్యాయమేనా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకా బోల్డ్ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. 
 

67

అల్లు అర్జున్‌ హీరోగా, రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న `పుష్ప2` చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో ఫహద్‌ ఫాజిల్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. అనసూయ,సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లోగానీ, వచ్చే ఏడాది సమ్మర్‌లోగానీ విడుదలయ్యే అవకాశం ఉంది. దీన్ని భారీగా, లార్జ్ స్కేల్‌లో రూపొందిస్తున్నారు దర్శకుడు సుకుమార్‌. 

77

అనసూయ.. ప్రస్తుతం నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది. అందులో `పుష్ప2`తోపాటు `సింబా`, తమిళంలో ఓ సినిమా చేస్తుంది. తెలుగులోనూ మరో రెండు మూడు చిత్రాలున్నాయి. వాటికి సంబంధించిన ప్రకటనలు రావాల్సి ఉంది. ఇటీవల `విమానం`లో అనసూయ వేశ్యగా నటించింది. దీంతోపాటు ప్రభుదేవాతో చేస్తున్న సినిమాలోనూ వేశ్యగా కనిపించబోతుందని సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories