16 ఏళ్ల వయసులోనే సొంత ఇల్లు, కారు కొన్నా.. ఆ డైరెక్టర్ పుణ్యమే, దేశముదురులో ఛాన్స్ కి కారణం పూరి కాదు

Published : Jun 29, 2023, 06:23 PM IST

దేశ ముదురు చిత్రంతో మొదలైన హన్సిక హవా ఇంకా కొనసాగుతోంది. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది.

PREV
16
16 ఏళ్ల వయసులోనే సొంత ఇల్లు, కారు కొన్నా.. ఆ డైరెక్టర్ పుణ్యమే, దేశముదురులో ఛాన్స్ కి కారణం పూరి కాదు

దేశ ముదురు చిత్రంతో మొదలైన హన్సిక హవా ఇంకా కొనసాగుతోంది. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది. ఇప్పటికే హన్సిక గ్లామర్ చూస్తే కుర్రాళ్లకు తెలియని అలజడి మొదలవుతుంది. 

26

టాలీవుడ్ లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతో హన్సిక ఆడి పాడింది. బొద్దుగా ఉండే హన్సిక గ్లామర్ చూసి యువత ఫిదా అయ్యారు. తమిళనాడులో అయితే హన్సికకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన హన్సిక హీరోయిన్ గా మారింది మాత్రం దేశముదురు చిత్రంతోనే. 

 

36

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దేశముదురు చిత్రంలో హన్సికని ఎంతో అందంగా చూపించారు. దీనితో యువతలో హన్సికకి ఫాలోయింగ్ పెరిగిపోయింది. రీసెంట్ గా హన్సిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేశముదురు చిత్రాన్ని గుర్తు చేసుకుంది. దేశముదురు చిత్రం వల్లే తాను సొంత ఇల్లు, కారు కొనుక్కోగలిగానని హన్సిక పేర్కొంది. అయితే తాను ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం పూరి జగన్నాధ్ కాదని షాకిచ్చింది. 

46

తనని పూరి జగన్నాధ్ దృష్టిలో పడేలా చేసింది మాత్రం డైరెక్టర్ మెహర్ రమేష్ అని పేర్కొంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మెహర్ రమేష్ కి నా గురించి తెలుసు. దేశముదురు కోసం పూరి గారు కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడు మెహర్ రమేష్ ఆయనకి నా గురించి చెప్పారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా నటించిందిఅని చెప్పారట. 

56

దీనితో వెంటనే పూరి జగన్నాధ్ తనని దేశముదురు చిత్రంలో ఎంపిక చేశారని హన్సిక తెలిపింది.  తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసిన హన్సిక వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. గత ఏడాది డిసెంబర్ 4న జైపూర్ లో హన్సిక, సోహైల్ వివాహబంధంతో ఒక్కటయ్యారు.

66

ప్రస్తుతం హన్సిక తన భర్తతో కలసి మ్యారేజ్ రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. వివాహం తర్వాత కూడా హన్సిక గ్లామర్ షోలో తగ్గేదే లే అంటోంది. ప్రస్తుతం హన్సిక భర్తతో ఎంజాయ్ చేస్తూ వెకేషన్స్ లో గడుపుతోంది. 

click me!

Recommended Stories