ఆ తర్వాత దీపక్, అతని భార్య కలసి దివ్యకు బట్టలు పెట్టడంతో అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఆ తర్వాత దివ్య ని రెడీ చేస్తూ ఉండగా తులసి దూరం నుంచి చూసి మురిసిపోతూ ఉంటుంది. వద్దు వద్దు నన్ను ఇలాగే చూడండి తర్వాత మళ్ళీ నా కూతురు అత్తారింటికి వెళ్లిపోతుంది అని అంటుంది. అప్పుడు దివ్య పెళ్లి చేస్తాను అని తొందర పెట్టింది నువ్వు అనడంతో, తొందరపడి పెళ్ళికొడుకుని వెతుకుంది నువ్వు అంటుంది తులసి. అబ్బాయిని నేను వెతుకున్న పెళ్లి ఎప్పుడు చేయాలని నిర్ణయించేది నువ్వు అంటుంది దివ్య. అబ్బాయిని లైన్ లో పెట్టుకున్నాను కానీ పెళ్లికి మాత్రం తొందర లేదమ్మా అని చెప్పాల్సింది నువ్వు అంటుంది తులసి.