ఆ తర్వాత ఆటో రావడంతో ఆటో డ్రైవర్ తో ఫోన్ తీసుకొని జరిగింది మొత్తం పోలీసులకు ఫోన్ చేసి వివరిస్తాడు రిషి. మరొకవైపు ఇంట్లో అందరూ వసుధార, రిషి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు దేవయాని రిషి వాళ్ళు రాలేదు అని జగతి,మహేంద్ర లపై సీరియస్ అవుతూ ఉంటుంది. మీ అందరికీ నేను అన్న మాటలే కనిపిస్తాయి కానీ రిషి మీద ఉన్న ప్రేమ మాత్రం కనిపించదు అని అరుస్తూ ఉంటుంది దేవయాని. మీ శిష్యురాలికి ఇదేమైనా పుట్టినిల్లు ఇక్కడ ఎలా ఉండాలో చెప్పాలి కదా అని జగతిపై సీరియస్ అవుతుంది. అప్పుడు ఓపికతో భరించిన ఫణింద్ర దేవయాని అని కోపంగా అరిచి ఓపికతో భరిస్తున్నారు కదా అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. ఇంతలోనే వసుధార, రిషి ఇద్దరు ఆటో దిగి రావడంతో అది చూసి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు.