వ్యక్తిగతంగా సుమ, రాజీవ్ ప్రస్తుతం సంతోషంగానే ఉన్నారు. కొన్ని నెలల క్రితం మాత్రం వారి వ్యక్తిగత జీవితంలో దూరం పెరిగినట్టు వార్తలు వచ్చాయి. సుమ కూడా తన భర్త గురించి వారి రిలేషన్షిప్ లో వచ్చిన ఇబ్బందుల గురించి రాజీవ్ పడిన ఇబ్బందుల గురించి కూడా కొన్నిసార్లు బహిరంగంగానే మాట్లాడారు. ఒకసారి మాత్రం సుమతో విడిగా ఉండాల్సిన రోజులు వచ్చాయని రాజీవ్ వివరించారు. తన తల్లి చనిపోయిన తర్వాత తండ్రి దేవదాసు కనకాల ఒక్కరే మణికొండలోని ఇంట్లో ఉండే వారని, అప్పుడు సుమతో కలిసి పిల్లలతో నేను వేరే చోట ఉండే వాళ్ళమని చెప్పాడు రాజీవ్. నాన్నకు తోడుగా ఉండేందుకు కొన్నాళ్లు తాను మణికొండలోనే ఉన్నానని, అప్పుడు సుమ నేను విడిగా ఉండాల్సి వచ్చిందని వివరించారు. కొన్ని రోజులు దూరంగా ఉండటంతో తమ విడిపోయాయని కొందరు రాసేసారని.. అంతే కానీ తాము ఎప్పుడు విడాకులు తీసుకోవాలన్న ఆలోచన లేదని ఆయన చెప్పుకొచ్చారు.