Suma Kanakala: అవును సుమ నాకంటే ఎక్కువ సంపాదిస్తుంది, మనసులో మాట బయటపెట్టిన రాజీవ్ కనకాల, ఏమన్నాడంటే?

Published : Jul 23, 2026, 07:34 AM IST

Suma Kanakala: తనకంటే ఎక్కువగా సంపాదిస్తున్న యాంకర్ సుమ గురించి ఆమె భర్త రాజీవ్ ఏమనుకుంటున్నారో తెలుసా? రాజీవ్ కనకాల సుమ విషయంలో ఏం జరుగుతోంది. మనసులో మాట బయటపెట్టిన రాజీవ్ ఏమన్నాడంటే?

PREV
15
టాలీవుడ్ లో బెస్ట్ కపుల్స్..

టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో సుమ, రాజీవ్ కనకాల కూడా ఉన్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న వీరు.. ఎన్నో ఏళ్ల నుంచి హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. మధ్యలో వీరిమధ్య విడాకుల రూమర్స్ వచ్చినా.. ఏమాత్రం లెక్కచేయకుండా వారి పని వారు చూసుకుంటున్నారు. అంతే కాదు రాజీవ్ కనకాలకు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు కూడా లేవు.. సుమా మాత్రం గత 10 ఏళ్లుగా మంచి ఫామ్ లో ఉంది. వరుస ఈవెంట్లతో చేతి నిండా సంపాదిస్తోంది. మరి ఈ విషయంలో రాజీవ్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి?

25
పరిస్థితులు తలకిందులు అయినప్పుడు..

ఒకప్పుడు నటుడిగా రాజీవ్ కనకాల మంచి ఫామ్ లో ఉండేవాడు. కానీ ఆతరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాజీవ్ కు అవకాశాలు తగ్గిపోయాయి. అడపా దడపా సినిమాలు మాత్రమే చేసుకుంటూ ఉండిపోయాడు. కానీ ఆయన భార్య సుమ కనకాల మాత్రం దూసుకుపోయింది. యాంకర్ గా స్టార్ డమ్ ను సంపాదించింది. రాజీవ్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా సంపాదిస్తోంది. ఈ విషయంలో ఇద్దిరి మధ్య పరిస్థితులు ఎలా ఉంటాయి. సుమ సంపాదన గురించి గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు రాజీవ్ కనకాల.

35
రాజీవ్ కనకాల మాట్లాడుతూ..

ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ ను "మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు?" అని అడగ్గానే, రాజీవ్ కనకాల ఎలాంటి మొహమాటం, సందేహం లేకుండా "తనే (సుమ) ఎక్కువ సంపాదిస్తుంది" అని వెంటనే ఒప్పుకున్నారు. సాధారణంగా భార్య తనకంటే ఎక్కువ సంపాదిస్తోందంటే పురుషుల్లో ఇగో దెబ్బతింటుందనే భావన సమాజంలో ఉంటుంది. కానీ రాజీవ్ మాత్రం దీనిపై చాలా పరిణతి చెందిన కామెంట్స్ చేశారు. టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు.. "ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఫేజ్ లేదా సమయం ఉంటుంది. ఆ సమయంలో ఒకరు బాగా బిజీగా ఉండవచ్చు, ఆర్థికంగా చాలా బలంగా ఉండవచ్చు. దాన్ని అంగీకరించడంలో ఎలాంటి తప్పూ లేదు" అని అన్నారు.

45
సుమ గురించి రాజీవ్ ఏమన్నాడంటే?

భార్య కెరీర్ తనను ఓవర్‌టేక్ చేస్తోందనే ఈగో కానీ అసూయ భావన తనలో ఎప్పుడూ రాలేదని, ఒకవేళ అలాంటి భావన ఉండి ఉంటే తమ బంధం ఇన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగేది కాదని రాజీవ్ క్లియర్ కట్ గా చెప్పాడు. సుమ ప్రతిభను, విజయాలను రాజీవ్ ఎంతగానో గౌరవిస్తాడు. "తను నిజంగా గ్రేట్ అండి" అంటూ భార్యను మనస్ఫూర్తిగా అభినందించారు. సమాజంలో ఇద్దరి మధ్య పోలికలు తెచ్చినప్పుడే మనుషుల్లో అసూయ మొదలవుతుందని.. బయటి జనాలు ఎవరు ఏమనుకున్నా, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అని మాట్లాడినా తానేమీ పట్టించుకోనని... "తను నా వైఫ్ కదా! తను అంత గొప్ప స్థానంలో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీలవుతాను" అని ఎంతో గర్వంగా రాజీవ్ చెప్పారు.

55
రాజీవ్ అంటే ప్రాణంగా సుమ..

రాజీవ్ కనకాలకు సుమ విడాకులు ఇవ్వబోతోందంటూ గతంలోవార్తలు వైరల్ అయ్యాయి. ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ ను స్పెర్డ్ చేశారు కొంత మంది. కానీ ఎంత మంది ఎన్ని ప్రచారాలు చేసినా.. తమ బంధం చాలా స్ట్రాంగ్ అని నిరూపించుకున్నారు ఈ జంట. అలసు ఆ రూమర్స్  ను పట్టించుకోలేదు కూడా. కొన్ని సందర్భాల్లో మాత్రం సుమ సరదాగా పంచ్ లు వేస్తూ.. ఈ వార్తలపై జోకులు పేల్చి వదిలేసింది. కానీ రాజీవ్ కనకాల అంటే తనకు ఎంత ఇష్టమనే విషయాన్ని చాలా సార్లు ఇండైరెక్ట్ గా అందరికి అర్ధమయ్యేలా చెప్పి రూమర్స్ కు చెక్ పెట్టింది స్టార్ యాంకర్.

Read more Photos on
click me!

Recommended Stories