Chennai LoveStory Review: చెన్నై లవ్‌ స్టోరీ మూవీ ఫస్ట్ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం హ్యాట్రిక్‌ కొట్టాడా?

Published : Jul 22, 2026, 09:15 PM IST

కిరణ్‌ అబ్బవరం `క`, `కే ర్యాంప్‌` చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు `చెన్నై లవ్‌ స్టోరీ`తో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చింది. మరి సినిమా టాక్‌ ఏంటంటే?

PREV
14
చెన్నై లవ్‌ స్టోరీ జులై 24 రిలీజ్‌

కిరణ్‌ అబ్బవరం కెరీర్‌ `క` సినిమాతో మారిపోయింది. మధ్యలో ఓ మూవీ తేడా కొట్టినా, `కే ర్యాంప్‌`తో మరో హిట్‌ కొట్టాడు. ఇప్పుడు హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టేందుకు వస్తున్నారు. తాజాగా ఆయన `చెన్నై లవ్‌ స్టోరీ` మూవీతో రాబోతున్నాడు. ఇందులో శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్‌గా నటించింది. సాయి రాజేష్‌ కథ అందించారు. రవి నంబూరి దర్శకత్వం వహించారు. అమృత ప్రొడక్షన్స్, మాస్‌ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్‌కేఎన్‌, సాయి రాజేష్‌ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ ఈ నెల 24న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఈ మూవీ టాక్‌ ఎలా ఉంది? సినిమా చూసిన వాళ్లు ఏం చెబుతున్నారనేది ఫస్ట్ రివ్యూలో తెలుసుకుందాం.

24
చెన్నై లవ్‌ స్టోరీ సెన్సార్‌ టాక్‌, స్టోరీ ఏంటంటే?

ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. యూ ఏ సర్టిఫికెట్‌ని పొందింది. 16ఏళ్లపై బడ్డవారు సినిమా చూడొచ్చు. లవ్‌ స్టోరీ విషయంలో కొంత రొమాన్స్ తప్ప, మిగిలినదంతా క్లీన్‌ ఫిల్మ్ అని టీమ్‌ తెలిపింది. లవ్‌, ఎమోషనల్‌ డ్రామా ప్రధానంగా సినిమా సాగుతుందట. యూత్‌ని బాగా ఆకట్టుకుంటుందని టీమ్‌ చెబుతోంది.ఈ సినిమా చెన్నై బేస్డ్ గా, చెన్నై నగరంలో సాగే ప్రేమ కథ. హైదరాబాద్‌కి చెందిన స్టీవెన్‌ శంకర్‌(కిరణ్‌ అబ్బవరం) సినిమాల్లో రాణించాలని చెన్నైకి వెళ్తాడు. అక్కడ సినిమా ఛాన్స్ ల కోసం చూస్తున్న క్రమంలో అప్పటికే లవ్‌ లో బ్రేకప్‌ అయిన అమ్మాయి శ్రీ గౌరీ ప్రియ కలుస్తుంది. కానీ కిరణ్‌ని ఆమె దూరం పెడుతుంది.   ఎట్టకేలకు వీరిద్దరు ప్రేమలో పడతారు. మరి గౌరీ ప్రియా ఫస్ట్ లవ్‌ స్టోరీ ఏంటి? ఫస్ట్ లవ్‌ కంటే రెండో ప్రేమ ఎందుకు గొప్పది? వీరిద్దరి ప్రేమ కథ ఏ తీరం చేరిందనేది ఈ మూవీ స్టోరీ అని సమాచారం.

34
చెన్నై లవ్‌ స్టోరీ ఫస్ట్ రివ్యూ

సినిమా ప్రారంభం నుంచి హీరో జర్నీని చూపిస్తుందట. ఆయన చెన్నై వెళ్లడం, అక్కడ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేయడం వంటి సీన్లతో సాగుతుందట. అదే సమయంలో హీరోయిన్‌ బ్రేకప్‌ ని చూపిస్తుందట. అనంతరం ఆ అమ్మాయి కోసం హీరో ప్రయత్నాలు చేయడం, మొదట ఆమె పట్టించుకోకపోవడం, ఆ తర్వాత ఇద్దరు కలిసిపోవడం జరుగుతుందట. ఇది కొంత రొటీన్‌గానే ఉంటుంది. కాకపోతే కిరణ్‌ అబ్బవరం సినిమా ప్రయత్నాలు కొంత కొత్తగా ఉంటాయట. హీరోయిన్‌ ఫస్ట్ లవ్‌, అది హీరోకి చెప్పడం వంటి సీన్లు ఫ్రెష్‌గా ఉంటాయని చెబుతున్నారు. ఫస్టాఫ్‌ సరదాగా సాగుతుందట. కొంత కామెడీ కూడా ఉంటుందట. ఆ తర్వాత సినిమా సీరియస్‌ లవ్‌ స్టోరీ వైపు టర్న్ తీసుకుంటుందని, అది ఎమోషనల్‌గా ఉంటుందని సమాచారం.

44
హీరో పాత్రలోని ట్విస్ట్, క్లైమాక్స్, ఎమోషన్స్ హైలైట్‌గా చెన్నై లవ్‌ స్టోరీ

సినిమాలో పెద్ద ట్విస్ట్ ఉంటుంది. హీరోకి సంబంధించిన ఆ ట్విస్ట్ మెయిన్‌గా ఉంటుందట. ఆ ట్విస్ట్ రివీల్‌ చేసిన తర్వాత కథని ఎలా ముందుకు తీసుకెళ్లారనేది ఆసక్తికరంగా ఉంటుందట. అదే ఆడియెన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుందనేది పెద్ద టాస్క్ లా ఉంటుందని సమాచారం. ఆడియెన్స్ ఆ ట్విస్ట్ కనెక్ట్ అయితే సినిమా పెద్ద హిట్‌. లేదంటే తేడా కొడుతుందంటున్నారు. క్లైమాక్స్ మరో హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ రెండే సినిమాకి ప్రాణం, బలం అని టాక్‌. అవి ఎంత వరకు ఆకట్టుకుంటాయో చూడాలి. అయితే హీరోహీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్, వారి మధ్య కెమిస్ట్రీ, ఎమోషనల్‌ సీన్లు బాగుంటాయని అంటున్నారు. సిరి హన్మంత్‌ ఎపిసోడ్‌ కూడా మరో ఆకర్షణ నిలుస్తుందని సమాచారం. ఓవరాల్‌గా యూత్‌తోపాటు ఫ్యామిలీ కూడా చూసేలా సినిమా ఉంటుందని చెబుతున్నారు. టీమ్‌ నుంచి, సినిమా చూసిన వారినుంచి వస్తోన్న సమాచారం ప్రకారం సినిమా హిట్‌ గ్యారంటీ అంటున్నారు. కాకపోతే ఆ ట్విస్ట్, క్లైమాక్స్, ఎమోషనల్‌ సీన్ల మీదనే సినిమా విజయం ఆధారపడి ఉంటుందట. మరి అది ఎంత వరకు ఆకట్టుకుంటాయో చూడాలి. ఏసియానెట్‌ ఒరిజినల్‌ రివ్యూ కోసం వేచి ఉండండి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories