సుమ, రాజీవ్ కనకాల దంపతులకు ఒక కొడుకు, కుమార్తె సంతానం. 2023లో సుమ, రాజీవ్ కనకాల తమ కొడుకు రోషన్ ని హీరోగా లాంచ్ చేశారు. రోషన్ నటించిన తొలి చిత్రం బబుల్ గమ్. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ రోషన్ పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రానికి డబ్బులు పెట్టింది సుమ, రాజీవ్ కనకాల దంపతులే. ఈ విషయాన్ని రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.