Mahesh babu: ఆగడు సినిమా ప్లాప్‌కి కారణం అతనే.. శ్రీనువైట్లకు అన్యాయం చేసిన పటాస్‌ డైరెక్టర్‌!

Published : Apr 10, 2025, 02:54 PM IST

Aagadu Flop: మహేష్ బాబుతో దూకుడు సినిమాతో రికార్డులు కొల్లగొట్టిన డైరెక్టర్‌ శ్రీనువైట్ల. తనదైన కామెడీ టైమింగ్‌తో సినిమాలను తీసి ఆడియన్స్‌ నుంచి ఒకప్పుడు చప్పట్లు కొట్టించుకున్నారు. కామెడీకి కేరాఫ్ అడ్రస్‌, బ్రాండ్ అంబాసిడర్‌గా ఓ వెలుగువెలిగారు శ్రీనువైట్ల. అయితే.. ఆగడు సినిమా డిజాస్టర్‌ తర్వాత డైరెక్టర్‌ శ్రీనువైట్ల సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే... ఆ సినిమా ప్లాప్‌ కావడానికి ఓ కారణం తానేనని తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న డైరెక్టర్‌ చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ ఆ విషయంలో గిల్టీగా ఫీలవుతున్నట్లు వెల్లడించారు. అసలు ఎవరా డైరెక్టర్‌, ఏంటా కథ తెలుసుకుందామా?   

PREV
15
Mahesh babu: ఆగడు సినిమా ప్లాప్‌కి కారణం అతనే.. శ్రీనువైట్లకు అన్యాయం చేసిన పటాస్‌ డైరెక్టర్‌!
srinu vaitla

శ్రీనువైట్ల తీసిన దూకుడు భారీ విజయాన్ని అందుకోవడంతో ఆగడు సినిమా అవకాశాన్ని మహేష్‌బాబు ఇచ్చారు. అయితే సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో శ్రీను వైట్లకు అవకాశాలు తగ్గిపోయాయి. రీసెంట్‌గా హీరో గోపచంద్ తో  విశ్వం సినిమా తీశారు. అయితే అదికూడా ప్లాప్‌ కావడం.. నిర్మాతలకు పీడకలను మిగిల్చింది. అయితే.. ఆగడుతో శ్రీనువైట్ల ఫాల్‌డౌన్‌ మొదలైందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఆ సినిమాకు సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ అయిన అనిల్‌రావిపూడి డైలాగ్‌, స్క్రిప్ట్‌ కోసం పనిచేశాడు. అతను చేసిన ఓ తప్పు వల్లే ఆగడు ప్లాప్‌ అయ్యిందట. 
 

25
anil ravipudi

అనిల్‌ రావిపూడి, శ్రీనువైట్ల కలిసి ఆగడు సినిమాకంటే ముందే పలు సినిమాల్లో కలిసి పనిచేశారు. అనిల్‌ మంచి టైమింగ్‌తో డైలాగ్‌లు రాస్తుండటంతో అది నచ్చి.. ఆగడు డైలాగ్స్‌, స్క్రిప్ట్‌ వర్క్‌ని అతనికి అప్పజెప్పారు. మొదటిపార్ట్‌ వరకు అనిల్‌, వైట్ల కలిసి పనిచేశారు. సరిగ్గా రెండో పార్ట్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుంది అన్న సమయంలో అనిల్‌కు పటాస్‌ సినిమాతో డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. దీంతో పటాస్‌ సినిమాకే అనిల్‌ రావిపూడి సమయం కేటాయించాల్సి వచ్చింది. 

35
anil ravipudi brahmaji

ఆగడు ఫస్టాఫ్‌ కామెడీగా తీయగా.. రెండో హాఫ్‌లో కాస్త సెంటిమెంట్‌తో తీస్తే బాగుంటుందని అనిల్‌ రావిపూడికి ఆలోచన వచ్చిందట. ఈ విషయాన్ని డైరెక్టర్‌ శ్రీనువైట్లకు చెబుదామని సినిమా సెట్లోకి వెళ్లగా.. అప్పటికే సెకండాఫ్‌ను చిత్రబృందం ప్రారంభించిందని అనిల్‌ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 

45
anil with mahesh babu

దర్శకుడు శ్రీనువైట్ల కూడా అప్పటికే సెకండాఫ్‌ ఉన్న స్క్రిప్ట్ బలంగా నమ్మడంతో తాను సలహా ఇచ్చేందుకు వెనకడుగు వేసినట్లు అనిల్‌ అంటున్నారు. సినిమా ఫ్లాత్‌ తర్వాత ఆరోజే దర్శకుడు వైట్లకు తన మనసులో ఆలోచన పంచుకుని ఉంటే బాగుండేదని.. ఇప్పటికీ తాను ఆ విషయంలో గిల్టీగా ఫీలవుతున్నట్లు బాధపడుతున్నారు అనిల్‌. 

 

55
anil with mahesh babu

పటాస్‌ సినిమా తొలిభాగం ఫుల్‌ కామెడీతో చేసి రెండో హాఫ్‌లో సెంటిమెంట్‌, హీరోయిజం ఎలివేట్‌ అయ్యేలా చేయడం వర్కౌట్‌ అయ్యిందని అనిల్‌ రావిపూడి చెబుతున్నారు. ఆగడుకి కూడా అదివిధంగా ప్లాన్‌ చేస్తే.. పటాస్‌ సెకండాఫ్‌, ఆగడుకి వచ్చేదని అన్నారు. పటాస్‌ సినిమా వల్ల ఆగడుకి పూర్తిస్థాయిలో పనిచేయలేకపోయానని అనిల్‌ చెప్పుకొచ్చారు. అందువల్లే సినిమా సరిగా ఆడలేదని అన్నారు. ఏ సినిమా అయినా తీసేటప్పుడు ఇది ప్లాప్‌ అవుతుందని ఎవరికీ తెలియదని, కొన్నిసార్లు మన జడ్జిమెంట్‌ రాంగ్‌ అవుతుంటుందన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories