చిరంజీవి తన కెరీర్ లో ఎక్కువగా అభిమానుల సంతోష పెట్టే మాస్ చిత్రాలు చేశారు. అప్పుడప్పుడూ స్వయం కృషి , ఆపద్భాందవుడు, రుద్రవీణ లాంటి కళాత్మక చిత్రాలు కూడా చేశారు. అయితే చిరంజీవి తన కెరీర్ లో తాను ఎంతో ఇష్టపడి.. తనకోసం తాను చేసిన చిత్రం ఒకటి ఉంది. ఆ మూవీ సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ కి విపరీతంగా నచ్చేసిందట. ఆ మూవీ మరేదో కాదు సైరా నరసింహా రెడ్డి.