రాజమౌళి బాహుబలి తర్వాత సౌత్ సినిమా బాలీవుడ్ మార్కెట్ ని కబ్జా చేసేసింది అని చెప్పొచ్చు. కేజీఎఫ్, కాంతార, హనుమాన్, కల్కి ఇలా చాలా చిత్రాలు హిందీలో అదరగొట్టాయి. ముఖ్యంగా తెలుగు నుంచి భవిష్యత్తులో మరిన్ని పాన్ ఇండియా చిత్రాలు సిద్ధం అవుతున్నాయి.
ఎమోషన్స్ వర్కౌట్ అయినప్పటికీ అన్ని చిత్రాలు అన్ని భాషల్లో వర్కౌట్ కావు. దానికి భారీతనం ఉండాలి. బాహుబలి చిత్రంతో రాజమౌళి అది చేసి చూపించారు. ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రం ఆ భాషలో మాత్రమే విజయం సాధిస్తుంది. కానీ గ్రాండ్ విజువల్స్, భారీ స్కేల్ ఉన్నప్పడే ఇండియా మొత్తం ఆదరణ ఉంటుంది. నాకు మొదట బాహుబలి చిత్ర రష్ ఫుటేజ్ చూపించారు. నేను ఒక్కటే చెప్పాను.. ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ అని ప్రొమోషన్స్ చేయండి అని అన్నాను.
ఎందుకంటే బాహుబలి నిజంగానే ఇండియాలో బిగ్గెస్ట్ మూవీ. అందులో ఎలాంటి అబద్దం లేదు. ఆడియన్స్ అది నమ్మి థియేటర్స్ కి వచ్చారు. మ్యాజిక్ జరిగింది అని కరణ్ జోహార్ అన్నారు. అదే రాజమౌళి గారి ఈగ చిత్రం తీసుకోండి.. ఈగ రివేంజ్ తీర్చుకోవడం అనేది అల్టిమేట్ కాన్సెప్ట్. కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఆ చిత్రాన్ని నార్త్ లో రిలీజ్ చేయాలంటే ఆలోచిస్తాను.. ఎందుకంటే అది భారీ చిత్రం కాదు.. కానీ అద్భుతమైన కాన్సెప్ట్ ఉన్న చిత్రం అని కరణ్ జోహార్ అన్నారు.
హిందీలో గ్రాండ్ విజువల్స్ తో ఇటీవల సినిమాలు రావడం లేదు. కేవలం సంజయ్ లీలా భన్సాలీ లాంటి దర్శకులు మాత్రమే గ్రాండ్ విజువల్స్ ట్రై చేస్తున్నారు. బాహుబలి చిత్రం క్రియేటివిటీ పరంగా బాలీవుడ్ దర్శక నిర్మాతలకు పెద్ద చెంపదెబ్బ అని కరణ్ జోహార్ అన్నారు. కరణ్ జోహార్ వ్యాఖ్యలపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. బాలీవుడ్ ని లాగిపెట్టి కొట్టే మరో చిత్రం వస్తోంది.. అదే పుష్ప 2 అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్నారు. పుష్ప 2 చిత్రాన్ని సుకుమార్ గ్రాండ్ విజువల్స్, యాక్షన్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఇప్పుడు పుష్ప 2 కి దక్కింది. మరి ఏం జరుగుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.