పుష్ప 2: సీక్వెల్ సీక్రెట్స్! సిద్దప్ప నాయుడుని సీఏం చేయటం, అదీ ఇగోతో

First Published | Dec 4, 2024, 10:09 AM IST

డిసెంబర్ 5న విడుదల కానున్న పుష్ప 2: ది రూల్ గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. సినిమాలో కీలకమైన అంశాలు, పాత్రల మధ్య సంబంధాలు, రాజకీయ నేపథ్యం వంటివి ఈ సీక్వెల్‌లో చూడవచ్చు.

Allu Arjun, #Pushpa2, sukumar

  భారీ ఎక్సపెక్టేషన్స్  నడుమ డిసెంబరు 5న చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2) మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.  పుష్ప 2 ఈ రాత్రి షోలతో జాతర మొదలైపోతుంది.ప్రీమియర్స్ , స్పెషల్ షోలు ప్రక్కన పెడితే  రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

ఈ రోజు రాత్రి ప్రీమియర్ స్క్రీనింగ్ చేస్తున్నారు.  దాంతో  సీక్వెల్ లో కీలకమైన అంశాలు ఏమి చూడబోతున్నామనేది ఇండస్ట్రీలో,మీడియా వర్గాల్లో  హాట్ టాపిక్ గా మారింది. అయితే కొన్ని కీ ఎలిమెంట్స్ బయిటకు వచ్చాయి. అవేంటో చూద్దాం. 

Allu Arjun, #Pushpa2, sukumar

ఇప్పటికే పుష్ప 2: ది రూల్ కోసం అడ్వాన్స్ బుకింగ్ భారీగా కొనసాగుతోంది.  తొలి రోజు  వంద కోట్లకు తక్కువ కాకుండా టిక్కెట్ సేల్స్ జరుగుతాయని ఎక్సెపెక్టేషన్స్ ఉన్నాయి. ప్రీమియర్స్ తో కలిపి 150 కోట్లు దాకా మొదటి రోజు షోలతో వస్తుందని చెప్తున్నారు.

కొంచెం అటూ ఇటూలో అదే అంకె ఉండే అవకాసం ఉంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నారు (ఇండియాలో 6,500.. ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్‌). దీంతో బిగ్గెస్ట్‌ రిలీజ్ ఇండియన్‌ సినిమాగా ‘పుష్ప2’ రికార్డు సృష్టించింది .  అలాగే ‘పుష్ప2’ ట్రైలర్‌ విడుదల చేసిన కొన్ని గంటల్లోపే 150 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
 



ఎంతో ఇంట్రస్టింగా  ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్‌ని చూడటానికి రకరకాల కారణాలున్నాయి. మొదటి భాగంలో సుకుమార్ టచ్ చేసిన చాలా అంశాలు ఇక్కడ క్లోజ్ అవబోతున్నాయి. ఫహ్లాద్ మరియు అల్లు అర్జున్ మధ్య కాంప్లిక్ట్, మంగళం శీను పగ, అజయ్ కుటుంబ రిలేషన్స్  ఈ సీక్వెల్ లో మనం చూడబోతున్నాము.

 విస్తృతంగా మాట్లాడుతున్న మరొక ఇంట్రస్టింగ్  ట్రాక్ ఉంది. పుష్పను సిండికేట్ లీడర్‌గా మార్చిన మంత్రి పాత్రలో సిద్దప్ప నాయుడుగా రావు రమేష్ నటించారు. సిద్దప్ప నాయుడుని సీఎం చేస్తాడని తెలుస్తోంది. తన దగ్గరున్న డబ్బుతో సిద్దప్పనాయుడుని సీఎం చేస్తాడు.
 


జగపతిబాబు పాత్ర విషయానికి వస్తే... సిద్దప్పనాయుడు సీఎం అవటాన్ని వ్యతిరేకిస్తాడు. తన దగ్గరున్న డబ్బుతో పుష్ప...సిద్దప్ప నాయుడుని సీఎం చేయటాన్ని జీర్ణించుకోలేకపోతాడు. అక్కడ నుంచి జగపతిబాబుకు , పుష్ప కు మధ్య వైరం మొదలవుతుంది.

అదో కీలకమైన ట్రాక్ గా సినిమా చివరి దాకా సాగుతుంది. ఇక పుష్ప..పనిగట్టుకుని సిద్దప్ప నాయుడుని సీఎం చేయటానికి గల కారణం అంతకు ముందు ఉన్న సీఎం ఆడుకాలం నరేష్ ...తనతో ఫొటో దిగటానికి ఇష్టపడకపోవటం, దాంతో ఇగో దెబ్బతిన్న పుష్ప ఇలా చేస్తాడని చెప్పుకుంటున్నారు. 


పుష్ప 2 మునుపటి బ్లాక్‌బస్టర్ "పుష్ప: ది రైజ్"ను మించి వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ ఎనలిస్ట్‌లు భావిస్తున్నారు. డిసెంబర్ 4న రాత్రి 9.30 నుంచి అల్లు అర్జున్ పుష్ప రూల్ మొదలైపోతుంది. తెలంగాణ వ్యాప్తంగా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కూడా వచ్చేసింది.

 విదేశాల్లో దీని ప్రీ సేల్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగానే హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఓవర్సీస్‌లో అత్యంత వేగంగా యాభైవేల టికెట్స్ సేల్‌ అయిన చిత్రంగా ‘పుష్ప2’ రికార్డు నెలకొల్పింది  . అమెరికన్‌ బాక్సాఫీస్‌లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్‌ ద్వారానే వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా ‘పుష్ప2’ నిలిచింది. 

ఈ సినిమానికి సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఈ సినిమా నిడివి 3: 18గంటలు ఉన్నట్లు సమాచారం .  రన్‌టైమ్‌ ఎక్కువ ఉన్నా సినిమా మంచి విజయాన్ని అందుకోవచ్చని ‘పుష్ప’ పార్ట్‌ 1 నిరూపించింది. ఆ మూవీ రన్‌టైమ్‌ దాదాపు 3 గంటలు.

దీంతో, పార్ట్‌ 2 నిడివి పార్ట్‌ 1 కంటే కాస్త పెరిగినా ప్రేక్షకులు ఆస్వాదించగలరని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.  నిర్మాత నవీన్‌ యెర్నేని సైతం ‘పుష్ప 2’ రన్‌టైమ్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్  చేశారు. లెంగ్త్ ఎంత ఉన్నా ఇబ్బందేం లేదని, సినిమా చూశాక అసలు దాని గురించే మాట్లాడుకోరని అన్నారు.

---

Latest Videos

click me!