కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 'తలైవర్ 173' సినిమా టైటిల్ 'ధర్మన్'గా ప్రకటించారు. ఈ పోస్టర్ రిలీజ్ అవ్వగానే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ట్రోల్స్‌కు గురవుతోంది. కారణం ఏంటంటే?
సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి చివరగా వచ్చిన సినిమా 'కూలీ'. పోయినేడాది రిలీజైన ఈ సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఆయన 'జైలర్ 2' సినిమాను కూడా పూర్తి చేశారు. ఇదిలా ఉంటే, రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ కలిసి నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నారు. వీటన్నింటితో పాటు, కమల్ హాసన్ నిర్మాణంలో రజినీ ఓ సినిమాకు ఓకే చెప్పారు. భారీగా తీస్తున్న ఈ సినిమాకు అప్పట్లో 'తలైవర్ 173' అని వర్కింగ్ టైటిల్ పెట్టారు.
25
రజినీకాంత్ సినిమాకు ప్రారంభంలోనే ఆటంకాలు..
'తలైవర్ 173' సినిమాకు మొదట సుందర్ సి దర్శకత్వం వహించాల్సి ఉంది. గత ఏడాది నవంబర్‌లో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు కూడా. కానీ, ప్రకటించిన వారంలోపే సుందర్ సి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. కథ నచ్చకపోవడంతో రజినీకాంత్ ఈ సినిమాను వద్దన్నారని అప్పట్లో టాక్ నడిచింది. ఆ తర్వాత 'డాన్' సినిమా డైరెక్టర్ సిబి చక్రవర్తి 'తలైవర్ 173'కి దర్శకత్వం వహిస్తారని అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పనులు కూడా వేగంగా మొదలయ్యాయి.
35
ఫైనల్ గా.. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో
అయితే, కొన్ని నెలలకే సిబి చక్రవర్తి కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో 'తలైవర్ 173' ప్రాజెక్ట్ ఆగిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ, ఆ రూమర్స్‌కు చెక్ పెడుతూ, ఇప్పుడు 'తలైవర్ 173' టైటిల్‌తో పాటు డైరెక్టర్ ఎవరో కూడా ప్రకటించారు. ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించబోతున్నట్లు వెల్లడించారు. ఈయన గతంలో 'ఓ మై కడవులే', ప్రదీప్ రంగనాథన్‌తో 'డ్రాగన్' వంటి సినిమాలు తీశారు.
రజినీకాంత్‌తో అశ్వత్ తీస్తున్న ఈ సినిమాకు 'ధర్మన్' అనే టైటిల్ పెట్టారు. కమల్ హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, అన్బరివ్ స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో సిమ్రాన్, రాశీ ఖన్నా, యోగిబాబు వంటి పెద్ద స్టార్ క్యాస్ట్ నటిస్తోంది. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తుండగా, ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్ చేయనున్నారు.
55
ఫస్ట్ లుక్ పోస్టర్ పై దారుణమైన ట్రోల్స్..
'ధర్మన్' టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రజినీకాంత్ ఎర్ర చొక్కా, ప్యాంటులో కనిపిస్తున్నారు. కానీ, ఆయన తలకి, శరీరానికి అస్సలు సంబంధం లేనట్టు ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కొంతమందైతే 'ఇది రజినీనా లేక ప్రదీపా?' అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇది ఒరిజినల్ ఫోటోనా లేక ఏఐ (AI) తో క్రియేట్ చేశారా అని ప్రశ్నలు వేస్తున్నారు.