కరెంట్‌ పోయిందని ప్రియురాలినే వదిలేసిన సూపర్‌ స్టార్‌.. రజనీకాంత్‌ క్రేజీ లవ్ స్టోరీ!

Published : Aug 26, 2025, 10:14 AM ISTUpdated : Aug 26, 2025, 10:26 AM IST

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ తన ఫస్ట్ లవ్‌ స్టోరీ బయటకు వచ్చింది.  కరెంట్‌ పోవడంతో తన లవ్‌ ప్రపోజల్‌ చేయకుండానే వచ్చేశాడట. 

PREV
14
రజనీకాంత్‌ ఎవరికీ తెలియని లవ్‌ స్టోరీ

శ్రీదేవిని భారతీయ సినిమా తొలి లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె, తన అందం, నృత్యం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అప్పట్లో దాదాపు అందరు స్టార్స్ తో కలిసి నటించింది శ్రీదేవి. అయితే వారిలో రజనీకాంత్‌తో కెమిస్ట్రీ మాత్రం వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. ఈ ఇద్దరు కలిసి వివిధ భాషల్లో 17కి పైగా చిత్రాల్లో కలిసి నటించారు. దీంతో ఈ వీరి జోడి విశేషంగా పాపులర్‌ అయ్యింది.

DID YOU KNOW ?
`కూలీ`తో సందడి
రజనీకాంత్‌ ఇటీవల `కూలీ` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ మిశ్రమ స్పందన రాబట్టుకుంది. కానీ సుమారు రూ.480కోట్ల కలెక్షన్లని రాబట్టింది.
24
శ్రీదేవిపై రజనీలో ఇష్టం స్టార్ట్ అయ్యింది ఇక్కడే

శ్రీదేవి, రజనీకాంత్ మొదటిసారి 1976లో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన 'మూండ్రు ముడిచ్చు' చిత్రంలో కలిసి నటించారు. అప్పట్లో శ్రీదేవి వయసు కేవలం 13 సంవత్సరాలు. ఆ సినిమాలో రజనీకాంత్‌కి సవతి తల్లిగా నటించారు! మొదటి సినిమాలోనే విచిత్రమైన కాంబినేషన్. అయితే, వారి కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. అది అనేక చిత్రాల్లో కొనసాగింది. తర్వాతి సంవత్సరాల్లో వీరి బంధం మరింత బలపడింది. రజనీకాంత్ శ్రీదేవి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపేవారు. శ్రీదేవి కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా ఆమె తల్లితో సన్నిహితంగా ఉండేవారు.

34
శ్రీదేవికి లవ్‌ ప్రపోజల్‌ చేయాలనుకున్న రజనీకాంత్‌

కాలక్రమేణా, రజనీకాంత్‌కి శ్రీదేవిపై ఆకర్షణ పెరిగింది. శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తన కుటుంబ సభ్యులకు చెప్పారు. కానీ రజనీకాంత్ శ్రీదేవికి ఎందుకు ప్రేమను వ్యక్తపరచలేదు? అనేది కె. బాలచందర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రజనీకాంత్ శ్రీదేవిని చాలా ప్రేమించేవారు. ప్రేమను చెప్పడానికి శ్రీదేవి ఇంటికి కూడా వెళ్లారు. అప్పట్లో శ్రీదేవి రజనీ కంటే 13 సంవత్సరాలు చిన్నవారు. రజనీ శ్రీదేవి ఇంటికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా కరెంటు పోయింది. ఈ ఊహించని సంఘటన రజనీని దిగ్భ్రాంతికి గురిచేసింది.

44
కరెంట్‌ పోవడంతో ప్రియురాలినే వదిలేసుకున్న రజనీకాంత్‌

రజనీ ఎప్పుడూ శకునాలను నమ్మేవారు. కరెంటు పోవడాన్ని చెడు శకునంగా భావించారు. ఈ సంఘటన రజనీకాంత్ మనసును మార్చేసింది. శ్రీదేవికి ప్రేమను చెప్పకుండా, ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. రజనీకాంత్ తన ప్రేమను ఎప్పుడూ వ్యక్తపరచకపోయినా, ఆయన, శ్రీదేవి చాలా కాలం స్నేహితులుగా ఉన్నారు. 2018లో శ్రీదేవి అకాల మరణం వరకు వారి స్నేహం కొనసాగింది. శ్రీదేవి 1996లో నిర్మాత-దర్శకుడు బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. రజనీకాంత్ 1981లో లతను వివాహం చేసుకున్నారు. రజనీకాంత్ శ్రీదేవి గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. కానీ వారి సన్నిహితులకు శ్రీదేవిని ఆయన ఎంతగానో ప్రేమించారనేది తెలుసు. మొత్తంగా కరెంట్‌ కారణంగా తన ప్రియురాలినే వదిలేసుకున్నారు రజనీ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories