చిరంజీవి, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఏంటో తెలుసా? చేస్తే మరో `జగదేక వీరుడు` అయ్యేది

Published : Aug 26, 2025, 09:31 AM IST

మెగాస్టార్‌ చిరంజీవి, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ ఓ మూవీ రావాల్సి ఉంది. షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఆపేశారు. ఆ కథేంటో చూస్తే. 

PREV
15
సింగీతం శ్రీనివాసరావుతో సినిమా మిస్‌ అయిన చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి దాదాపు తన సమకాలీకులైన అందరు దర్శకులతో పనిచేశారు. కె రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, రవిరాజా పనిశెట్టిలతోపాటు సీనియర్లు, జూనియర్లు ఇలా దాదాపు అందరితోనూ వర్క్ చేశారు. ఇప్పుడు కొత్త వారిని ఎంకరేజ్‌ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మెగాస్టార్‌.. సెల్యులాయిడ్‌ సైంటిస్ట్ గా పేరుతెచ్చుకున్న సింగీతం శ్రీనివాసరావుతో మాత్రం పనిచేయలేదు. ఈ కాంబినేషన్‌లో సినిమా పడి ఉంటే నిజంగానే అదొక అద్బుతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే అలాంటి మూవీ ఒకటి సెట్‌ అయ్యింది. కానీ ఆదిలోనే ఆగిపోయింది.

DID YOU KNOW ?
`అందరివాడు`లో టబుతో
చిరంజీవి, టబు కలిసి `అందరివాడు`లో నటించారు. ఈ మూవీకి శ్రీనువైట్ల దర్శకుడు. ఇందులో చిరు డ్యూయెల్‌రోల్‌ చేశారు.
25
చిరంజీవితో సింగీతం `భూలోక వీరుడు` మూవీ

చిరంజీవి, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సి ఉంది. ఏం జరిగిందో ఏమో షూటింగ్‌ స్టార్ట్ చేసి ఆపేశారట. ఆ సినిమానే `భూలోక వీరుడు`. ఫాంటసీ కథతో ఈ మూవీని చేయాలని ప్లాన్‌ చేశారు. చిరంజీవికి ఈ కాన్సెప్ట్, స్టోరీ బాగా నచ్చింది. ఓకే చేశారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. భారీ బడ్జెట్‌తో భారీ ఫాంటసీగా దీన్ని తీయాలనుకున్నారు. ఇందులో హీరోయిన్‌గా టబుని ఎంపిక చేశారు. సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. చిరంజీవి, టబులపై పోస్టర్లు కూడా రిలీజ్‌ చేశారు. రెండు షెడ్యూల్స్ షూటింగ్‌ జరిగిందట. కానీ అనూహ్యంగా మూవీని పక్కన పెట్టేశారు.

35
చిరంజీవి మరో `జగదేక వీరుడు` లాంటి బ్లాక్‌ బస్టర్‌ మిస్‌

బడ్జెట్‌ సమస్యనా? లేక ఈ కథ చిరంజీవికి సెట్‌ కాదని భావించారా? కారణం ఏంటో తెలియదు కానీ ఈ సినిమాని రెండు షెడ్యూల్స్ తర్వాత ఆపేశారు. అప్పట్లో ఇండస్ట్రీ మొత్తం ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నారు. అయితే సింగీతం సైన్స్ ఫిక్షన్‌, సోషియో ఫాంటసీలు, జానపదాలు తీయడంలో దిట్ట. `ఆదిత్య 369`, `భైరవద్వీపం`, `పుష్పక విమానం` వంటి సినిమాలు రూపొందించి వండర్స్ క్రియేట్‌ చేశారు. ఈ మూవీస్‌ ఇప్పుడు వస్తే ఒక్కోటి రెండువేల కోట్ల ప్రాజెక్ట్‌లు అయ్యేవి. అప్పట్లోనే చాలా తక్కువ బడ్జెట్‌తోనే తీసి ఇండస్ట్రీలను షేక్‌ చేశారు. ఈ నేపథ్యంలో చిరంజీవితోనూ అలాంటి మూవీ ప్లాన్‌ చేశారు. కానీ ఇది వర్కౌట్‌ కాలేదు. ఒకవేళ `భూలోకవీరుడు` మూవీనే వచ్చి ఉంటే, చిరంజీవి `జగదేక వీరుడు అతిలోక సుందరి`ని మించిన బ్లాక్‌ బస్టర్‌ అయ్యేదని చెప్పడంలో అతిశయోక్తి కాదు.

45
మరో సోషియో ఫాంటసీ `విశ్వంభర`తో వస్తోన్న చిరు

చిరంజీవికి మైథలాజికల్‌, జానపదాలు సెట్ కాలేదు. ఒక్క `జగదేక వీరుడు అతిలోక సుందరి`(ఇది సోషియో ఫాంటసీ)తప్ప. `అంజి`, `శ్రీమంజునాథ`, చివరికి హిస్టారికల్‌ ఫిల్మ్ `సైరా` సైతం ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ కాలేకపోయాయి. ఇప్పుడు తనకు బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్ ఇచ్చిన సోషియో ఫాంటసీ జోనర్‌లోనే ప్రయత్నిస్తున్నారు. `విశ్వంభర` మూవీ ఈ జోనర్‌లోనే తెరకెక్కుతోంది. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. వీఎఫ్‌ఎక్స్ విషయంలో మేకర్స్ రాజీపడటం లేదు. గతంలో విడుదలైన టీజర్‌లో వీఎఫ్‌ఎక్స్ కి విమర్శలు వచ్చిన నేపథ్యంలో టీమ్ గ్రాఫిక్స్ విషయంలో రాజీపడటం లేదు. దీంతో రిలీజ్‌కి ఆలస్యమవుతుందని ఇటీవలే చిరంజీవి తెలిపారు. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.

55
వింటేజ్‌ చిరంజీవిని చూపించబోతున్న అనిల్‌ రావిపూడి

దీంతోపాటు ప్రస్తుతం చిరంజీవి.. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో `మన శంకరవరప్రసాద్‌ గారు` పేరుతో సినిమా చేస్తున్నారు. ఇందులో వింటేజ్‌ చిరుని చూపించబోతున్నారట అనిల్‌. ఆయన డాన్సులు, ఫైట్లు, మ్యానరిజం, కామెడీ, స్టయిల్‌ ఇలా అన్నీ వింటేజ్‌ స్టయిల్‌లో ట్రే చేస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్‌ గ్లింప్స్ ఆకట్టుకుంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వెంకటేష్‌ గెస్ట్ రోల్‌లో మెరవోబోతున్నారట. సాహు గారపాటితోపాటు చిరు కూతురు సుస్మిత ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories