ఫ్లాప్‌ సినిమా కోసం ఇండస్ట్రీ హిట్‌ని మిస్‌ చేసుకున్న రవితేజ.. ఆ మూవీ చేసి ఉంటే బిగ్గెస్ట్ సూపర్‌స్టార్‌

Published : Aug 26, 2025, 07:55 AM IST

మాస్‌ మహారాజా రవితేజ తన కెరీర్‌లో చాలా సినిమాలు మిస్‌ చేసుకున్నారు. కానీ ఒక ఫ్లాప్‌ మూవీ కోసం ఒక ఇండస్ట్రీ హిట్‌ని వదులుకోవడం గమనార్హం. 

PREV
15
ఇండస్ట్రీ హిట్‌ని మిస్‌ చేసుకున్న రవితేజ

మాస్‌ మహారాజా రవితేజ `ఇడియట్‌`తో బిగ్‌ బ్రేక్‌ అందుకున్నారు. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. `ఖడ్గం`, `అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి`, `వెంకీ`, `భద్ర`, `విక్రమార్కుడు`, `కిక్‌`, `శంభో శివ శంభో`, `బలుపు`, `పవర్‌`, `రాజా ది గ్రేట్‌`, `క్రాక్‌`, `వాల్తేర్‌ వీరయ్య` వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకుని స్టార్‌గా ఎదిగారు. అయితే రవితేజ కెరీర్‌లో కొన్ని హిట్‌ సినిమాలు మిస్‌ చేసుకున్నారు. డేట్స్ ఇష్యూ వల్ల కొన్నిసినిమాలు చేయకపోవడం, స్క్రిప్ట్ లు సెట్‌ కాక మరికొన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. కానీ ఈ క్రమంలో ఒక ఇండస్ట్రీ హిట్‌ని మిస్‌ చేసుకున్నారు రవితేజ. ఒక ఫ్లాప్‌ మూవీ కోసం ఆయన ఏకంగా బ్లాక్‌ బస్టర్‌ మూవీని వదిలేసుకోవడం గమనార్హం. ఆ మూవీ ఏంటనేది చూస్తే.

DID YOU KNOW ?
`కర్తవ్యం`తో ఎంట్రీ
రవితేజ 1990లో `కర్తవ్యం` మూవీతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఇందులో విలన్‌కి ఫ్రెండ్‌ పాత్రని పోషించారు. పెద్దగా గుర్తింపు లేని పాత్ర.
25
`పోకిరి` సినిమా చేసే అవకాశం వదులుకున్న మాస్‌ మహారాజా

రవితేజ మిస్‌ చేసుకున్న ఆ మూవీనే `పోకిరి`. ఈ చిత్రానికి మొదట అనుకున్న హీరో రవితేజనే. ఆయనకంటే ముందే పవన్‌ తో చేయాలని దర్శకుడు పూరీ జగన్నాథ్‌ భావించారు. కానీ అది ఆరంభదశలోనే కుదరలేదు. ఆ తర్వాత రవితేజతో చేయాలనుకున్నారు పూరీ. ఇంకా చెప్పాలంటే ఆయన కోసమే ఈ కథ రెడీ చేశారట. రవితేజకి కూడా చెప్పారు. ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. `ఉద్దమ్‌ సింగ్‌ సన్నాఫ్‌ సూర్యనారాయణ` పేరుతో ఈ మూవీని తీయాలనుకున్నారు పూరీ. త్రిష హీరోయిన్‌గా అనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగానూ ప్రకటించారట. రైటర్‌ తోట ప్రసాద్‌ సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు.

35
`పోకిరి`ని పక్కన పెట్టి `నా ఆటోగ్రాఫ్‌`కి కమిట్‌ అయిన రవితేజ

అయితే అదే సమయంలో రవితేజ వద్దకు మరో ప్రాజెక్ట్ వచ్చింది. అదే రీమేక్‌. తమిళంలో సూపర్ డూపర్ హిట్టయిన 'ఆటోగ్రాఫ్' తెలుగు రీమేక్ లో చేసే ఛాన్సు. వదులుకోకూడదు, వదిలితే ఎవరో ఒకరు చేసేస్తారు అనే భయంతో వెంటనే కమిటైపోయాడు. రవితేజ హార్ట్ ని టచ్ చేసిన సినిమా అది. దాంతో 'ఆటోగ్రాఫ్' ప్రాజెక్టుకి ఆటో గ్రాఫ్ ఇచ్చేశాడు రవితేజ. దీంతో 'పోకిరి'కి తాత్కాలిక బ్రేక్ పడింది.

45
ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన `పోకిరి`

ఆ తర్వాత సోనూసూద్‌తో చేయాలనుకున్నారు పూరీ. కానీ బడ్జెట్‌ లెక్కలు సెట్‌ కాలేదు. దీంతో ఆగిపోయింది. ఆ తర్వాత ఇది మహేష్‌ బాబు వద్దకు వెళ్లింది. మహేష్‌ ఓకే చెప్పడంతో టైటిల్‌ మారిపోయింది. హీరోయిన్‌ మారింది. ఇలియానాని హీరోయిన్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.  ఈ మూవీ 2006 ఏప్రిల్‌ 26న విడుదలైంది. ఇక `పోకిరి` తెలుగు చిత్ర పరిశ్రమలో సృష్టించిన సంచలనం ఎలాంటిదో అందరికి తెలిసిందే. బాక్సాఫీస్‌ ని షేక్‌ చేసింది. ఆ సమయలో టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లని సాధించిన సినిమాగా సరికొత్త రికార్డుని క్రియేట్‌ చేసింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

55
ఫ్లాప్‌ మూవీ కోసం `పోకిరి`ని వదులుకన్న రవితేజ

ఇలా రవితేజ `పోకిరి`ని మిస్‌ చేసుకున్నారు. ఈ మూవీ స్థానంలో చేసిన `నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమొరీస్‌` బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇలా రవితేజ.. ఒక ఫ్లాప్‌ మూవీ కోసం ఇండస్ట్రీ హిట్‌ని మిస్‌ చేసుకున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన `మాస్‌ జాతర` చిత్రంలో నటిస్తున్నారు. కొత్త దర్శకుడు భాను భోగవరపు రూపొందిస్తోన్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ లోనే విడుదల కావాల్సింది. కానీ అక్టోబర్‌కి వాయిదా వేసినట్టు సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories