ఆ అవమానం వల్లే ఫారిన్‌ కారు కొనాలనుకున్నా: రజనీకాంత్‌

Published : Jun 24, 2020, 01:42 PM IST

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా సినిమాలకు సంబంధించిన యాక్టివిటీ పూర్తిగా ఆగిపోయింది. షూటింగ్‌లు, ప్రమోషన్‌ కార్యక్రమాలు, రిలీజ్‌లు ఆగిపోవటంతో సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్‌ ఏమీ లేవు. అయితే ఈ సమయంలో అభిమానులు తమ ఫేవరెట్‌ స్టార్స్‌ గతంలో చెప్పిన ఆసక్తికర అంశాలను తిరిగి గుర్తు చేసుకుంటున్నారు.

PREV
15
ఆ అవమానం వల్లే ఫారిన్‌ కారు కొనాలనుకున్నా: రజనీకాంత్‌

తాజాగా అలాంటి వార్తలే సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. గతంలో రజనీకాంత్ చెప్పిన ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రజనీకాంత్‌ దర్బార్ ఆడియో వేడుకలో ఓ ఆసక్తికర అనుభవాన్ని వెల్లడించాడు. తన కెరీర్‌ స్టార్టింగ్‌లో ఓ నిర్మాత తనను ఎలా అవమానించాడు చెప్పాడు రజనీ.

25

16 వయతినిలే సినిమా తరువాత రజనీకి ఓ స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చింది. తన పాత్ర వైవిధ్యంగా ఉండటంతో రజనీ సినిమా చేసేందుకు అంగీకరించాడు. పారితోషికం మాట్లాడుతున్న తరువాత షూటింగ్ ప్రారంభమయ్యే రోజు అడ్వాన్స్‌ ఇస్తామని సదరు చిత్ర యూనిట్ ఒప్పందం చేసుకున్నారు.

35

అయితే ఏవీయం స్టూడియోలో షూటింగ్ ప్రారంభమయిన రోజు కూడా నిర్మాత డబ్బు ఇవ్వకపోవంటంతో రజనీ మేకప్‌ వేసుకునేందుకు నిరాకరించాడు. అయితే అదే సమయంలో అంబాసిడర్‌ కారులో అక్కడకు వచ్చిన నిర్మాత రజనీ మీద ఆగ్రహంతో ఊగిపోయాడట. నువ్వేమైనా స్టార్ హీరోని అనుకుంటున్నావా..? ఎన్ని సినిమాలు చేశావు? నీకంటూ ఏం ఇమేజ్ ఉంది..? అంటూ రజనీని దుర్భాషలాడాడట. అంతేకాదు ఈ సినిమాలో నీకు అవకాశం లేదని చెప్పి వెళ్లిపోమ్మని చెప్పాడు.

45

అయితే రజనీ తన దగ్గర తిరిగి వెళ్లేందుకు డబ్బు లేదని కనీసం అక్కడి వరకు డ్రాప్ చేయాలని కోరినా.. సదరు నిర్మాత డబ్బు లేకపోతే నడిచి వెళ్లమని వెటకారం చేశాడట. ఈ సంఘటనను వివరించిన రజనీ ఆ సమయంలోనే తాను తిరిగి ఆ ఏవీయం స్టూడియోలో అడుగుపెడితే ఫారిన్‌ కారులోనే అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడట.

55

అందుకే ఓ పెద్ద చిత్రంలో అవకాశం రావటంతో ఆ పారితోషికంతో ఫియట్‌ కారు కొని, దానికి డ్రైవర్‌ను పెట్టుకొని ఆ కారులో వెళ్లి ఏవీయం స్టూడియోలో రెండు సిగరెట్లు కాలుస్తూ స్టైల్‌గా దిగా అని చెప్పుకొచ్చాడు రజనీ. అయితే కేవలం తన టాలెంట్‌ మాత్రమే కాదు, కాలంతో పాటు ప్రజల ఆశీర్వాదం కారణంగానే తాను ఈ స్థాయికి వచ్చానని చెప్పాడు రజనీకాంత్‌.

click me!

Recommended Stories