నా జుట్టు మొత్తం ఊడిపోయింది, నాగార్జున ఇంత యంగ్ గా ఉండడానికి కారణం ఇదే.. ఆ సీక్రెట్స్ బయటపెట్టిన రజనీ

Published : Aug 04, 2025, 04:17 PM IST

నాగార్జున యంగ్ లుక్ సీక్రెట్ ని సూపర్ స్టార్ రజనీకాంత్ బయటపెట్టారు. దాదాపు 30 ఏళ్ళ క్రితం తాను నాగార్జునతో కలిసి నటించినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడని రజనీకాంత్ అన్నారు. 

PREV
15
రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ 

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలి చిత్రం ఆగష్టు 14న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. లోకేష్ కనకరాజ్, రజనీకాంత్ కాంబినేషన్ లో రూపొందిన తొలి చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో లోకేష్ కనకరాజ్ మూవీ మేకింగ్ స్టైల్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా ముగ్గురు క్రేజీ స్టార్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

DID YOU KNOW ?
తొలిసారి విలన్ గా నాగార్జున
తన కెరీర్ లో తొలిసారి నాగార్జున విలన్ పాత్రలో నటిస్తున్నారు. నాగార్జున విలన్ గా నటించిన రజనీకాంత్ కూలీ చిత్రం ఆగష్టు 14న రిలీజ్ అవుతోంది. 
25
విలన్ పాత్రలో నాగార్జున 

 అక్కినేని నాగార్జున తన కెరీర్ లో తొలిసారి విలన్ గా నటిస్తున్నారు. నాగార్జున సైమన్ అనే పాత్రలో నటిస్తున్నారు. సోమవారం రోజు హైదరాబాద్ లో కూలీ చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. రజనీకాంత్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు కానీ వీడియో సందేశం పంపారు. రజనీకాంత్ నాగార్జునని ప్రశంసలతో ముంచెత్తారు. 

35
రాజమౌళి లాగా లోకేష్ కనకరాజ్ 

రజనీకాంత్ మాట్లాడుతూ.. తెలుగు సినీ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తి అవుతోంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించిన కూలీ చిత్రం ఆగష్టు 14న రిలీజ్ అవుతోంది. తెలుగులో రాజమౌళి ఎలాగో తమిళంలో లోకేష్ కనకరాజ్ అలాగ. ఆయన తీసిన అన్ని చిత్రాలు సూపర్ హిట్స్. ఈ చిత్రంలో అమీర్ ఖాన్, ఉపేంద్ర, నాగార్జున నటించారు. గొప్ప విషయం ఏంటంటే నాగార్జున ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించారు. 

45
నాగార్జున డబ్బు కోసం చేయరు 

ఈ చిత్ర కథ విన్నప్పుడు విలన్ పాత్రలో కూడా నేనే నటించాలి అనేంత ఆసక్తి నాకు కలిగింది. ఆ పాత్రలో ఎవరు నటిస్తారు అని ఎదురుచూస్తున్న టైంలో లోకేష్ కనకరాజ్ గుడ్ న్యూస్ చెప్పారు. నాగార్జున సైమన్ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నారు అని తెలిపాడు. నేను ఆశ్చర్యపోయా. అదే విధంగా చాలా సంతోషంగా అనిపించింది. నాగార్జున గారు డబ్బు కోసం అయితే ఒప్పుకోరు. ఎందుకంటే ఆయనకి డబ్బు అవసరం లేదు. 

55
నాగార్జున యంగ్ లుక్ సీక్రెట్స్ 

33 ఏళ్ళ క్రితం నేను, నాగార్జున ఒక చిత్రంలో నటించాం. అప్పుడు నాగార్జున ఎంత యంగ్ గా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే యాంగ్ గా ఉన్నారు. నాకేమో జుట్టు మొత్తం ఊడిపోయింది. ఇంత యంగ్ గా ఉండడానికి కారణం ఏంటి అని కూలీ చిత్రంలో నాగార్జునతో నటిస్తున్నప్పుడు అడిగా. ఆయన ఏమీ లేదు సర్.. రోజూ వ్యాయామం చేస్తాను. కాసేపు స్విమ్మింగ్, సాయంత్రం 6 కి డిన్నర్ కంప్లీట్ చేస్తాను అని చెప్పారు. మా తండ్రి నుంచి వచ్చిన జీన్స్ వల్ల కూడా యంగ్ గా ఉన్నాను. అదే విధంగా మా తండ్రి బయట విషయాలు తలకి ఎక్కించుకోవద్దు.. జరగాల్సింది జరుగుతుంది అని సలహా ఇచ్చినట్లు నాగార్జున నాకు చెప్పారు. ఈ చిత్రంలో నాగార్జున యాక్టింగ్ చూసి ఆశ్చర్యపోయినట్లు రజనీకాంత్ తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories