గతంలో హీరో నితిన్ వరుస ఫ్లాపుల నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు కూడా నితిన్ కి వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. గతంలో నితిన్ ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులని ఈ ఫ్లాపులు గుర్తు చేస్తున్నాయి. భీష్మ తర్వాత నితిన్ నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. కెరీర్ బిగినింగ్ లో జయం, దిల్, సై లాంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నితిన్ టాలీవుడ్ లో అగ్ర హీరోల్లో ఒకడవుతాడని అంతా ఆశించారు.
DID YOU KNOW ?
అగ్ర దర్శకులతో నితిన్
అగ్ర దర్శకులతో సినిమాలు చేసే అవకాశం కొందరు హీరోలకి మాత్రమే దక్కుతుంది. నితిన్ తన కెరీర్ లో రాజమౌళి, వివి వినాయక్, పూరి జగన్నాధ్, రాఘవేంద్ర రావు, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి అగ్ర దర్శకులతో సినిమాలు చేశారు.
25
కంబ్యాక్ ఇవ్వాల్సిందే
ఆ తర్వాత పదేళ్ల పాటు నితిన్ కి సరైన హిట్ లేదు. ఇష్క్ చిత్రంతో కంబ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా నితిన్ కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకుండా నితిన్ మార్కెట్ పూర్తి స్థాయిలో దెబ్బ తినే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భీష్మ తర్వాత నితిన్ చెక్, రంగ్ దే, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు చిత్రాలలో నటించారు. ఈ చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.
35
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నితిన్
ప్రస్తుతం నితిన్ రెండు చిత్రాలని ఓకె చేసినట్లు తెలుస్తోంది. ఎల్లమ్మ చిత్రం బలగం వేణు దర్శకత్వంలో, దిల్ రాజు బ్యానర్ లో ఆల్రెడీ ఖరారు అయింది. ఇష్క్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మరో చిత్రం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇది నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రంలో నితిన్ పాత్రకి సంబంధించిన ఆసక్తికర వివరాలు బయటకి వచ్చాయి. నితిన్ ఈ మూవీలో హార్స్ రైడర్ గా ఒక వీరుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో కీలకం కాబోతున్నాయట. ఈ చిత్రం కోసం నితిన్ బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ కి కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
55
తమ్ముడు ఫ్లాప్
ఈ ఏడాది చివర్లో నితిన్, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో మూవీ మొదలవుతుంది. ఈలోపు బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ చిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. నితిన్ చివరగా వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటించిన తమ్ముడు చిత్రం బిగ్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీతో హీరోయిన్ లయ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.