రజనీ, వెంకీ, మహేష్‌, రామ్‌ చరణ్‌.. డబ్బులు తీసుకునే అంబానీ పెళ్లికి వెళ్లారా? దుమారం రేపుతున్న నాగ్‌ కామెంట్స్

Published : Jul 13, 2024, 12:45 PM ISTUpdated : Jul 13, 2024, 12:47 PM IST

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, వెంకటేష్‌, మహేష్‌ బాబు, రామ్‌ చరణ్‌, రానా వంటి సెలబ్రిటీలు అంబానీ పెళ్లికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గతంలో నాగ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.   

PREV
16
రజనీ, వెంకీ, మహేష్‌, రామ్‌ చరణ్‌.. డబ్బులు తీసుకునే అంబానీ పెళ్లికి వెళ్లారా? దుమారం రేపుతున్న నాగ్‌ కామెంట్స్

ప్రపంచ కుబేరుడు ముఖేష్‌ అంబానీ చిన్న కొడుకు అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా ఇది నిలిచిపోతుంది. భారతీయ సాంప్రదాయాలన్నీ ఒకే చోట కనిపించేలా ఈ మ్యారేజ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. ప్రపంచ మీడియా మొత్తం ఇప్పుడు అంబానీ ఇంట పెళ్లి గురించే మాట్లాడుతుంది. 
 

26

సుమారు ఐదువేల కోట్ల ఖర్చుతో ఈ పెళ్లి చేస్తున్నాడట ముఖేష్‌ అంబానీ. తన ఇంట చివరి పెళ్లి కావడంతో ఎప్పటికీ గుర్తిండిపోయేలా, ఇంకెవరికీ సాధ్యం కాని విధంగా ప్లాన్‌ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ పెళ్లిలో ఇండియన్‌ సినిమా, క్రీడా సెలబ్రిటీలు సందడి చేశారు. రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు మెరిశారు. మన తెలుగు నుంచి మహేష్‌ బాబు, వెంకీ, రామ్‌ చరణ్‌, రానా, అలాగే రజనీకాంత్‌ పాల్గొన్నారు. బాలీవుడ్‌ మొత్తం దిగింది. మొత్తం సినిమా స్టార్లతో కళకళలాడింది అంబానీ పెళ్లి వేడుక. 

36
Ram Charan

అందరు స్టార్స్ ఒకేచోట కనిపించడంతో చూడ్డానికి అభిమానులకు రెండు కళ్లు సరిపోలేదని చెప్పొచ్చు. ఇలాంటి సందర్భం చాలా అరుదుగా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే అసాధ్యమే. అందుకే ఈ పెళ్లి చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, ఇలా అన్ని విభాగాల ప్రముఖులు పాల్గొన్నారు. డాన్స్ లు చేశారు. ఆటపాటతో అలరించారు. అతిథులను అలరించారు. ప్రస్తుతం ఆయా ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. రజనీకాంత్‌ కూడా డాన్స్ చేయడం విశేషం. 

46
Nagarjuna Akkineni

ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగార్జున వీడియో ఒకటి వైరల్‌ అవుతుంది. సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. నాగ్‌.. ఓపెన్ హార్ట్ విత్‌ ఆర్కే టాక్‌ షోలో డబ్బున్నొళ్లంతా ఇప్పుడు సినిమా సెలబ్రిటీలను డబ్బులిచ్చి గెస్ట్ లుగా ఆహ్వానిస్తున్నారని, గెస్ట్ గా వస్తే కోట్లు ఆఫర్‌ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బాలీవుడ్‌ సెలబ్రిటీలు చాలా వరకు అలానే వెళ్తున్నారని, కోట్లల్లో మనీ తీసుకుంటున్నారని తెలిపారు. 
 

56

నాగ్‌ ఏం చెప్పాడంటే.. `పెళ్లిళ్లకి డబ్బులిచ్చి తీసుకొస్తుంటే ఇంకా ఏం చెబుతామండి. మా పెళ్లికి రండి, మేం డబ్బులిస్తాం అంటున్నారు. నేను ఎప్పుడూ వెళ్లలేదు, కానీ ఆ ప్రపోజల్‌ నాకు తెలుసు, నన్ను కూడా అడిగారు. గెస్ట్ గా వచ్చి ఓ 20 నిమిషాలు స్పెండ్‌ చేసి, ఎంటర్‌టైన్‌ చేసి వెళ్లిపోండి అని చెబుతున్నారు. ఎంత ఇస్తారనే దానికి ఎండ్‌ లేదు, బాలీవుడ్‌ స్టార్స్ కి కోటి రూపాయల వరకు ఇస్తుంటారని, మన వారికి కూడా బాగానే ఇస్తారని, అయితే సక్సెస్‌ ఉంటేనే మన వద్దకు వస్తుంటారని, లేకపోతే పట్టించుకోరని తెలిపారు నాగార్జున. అలా వెల్లడంలో తప్పేం లేదు. వాళ్లేం తప్పు చేయడం లేదు అని ఆయన వెల్లడించడం విశేషం.
 

66
Rajinikanth

అంబానీ పెళ్లికి మన స్టార్స్, బాలీవుడ్‌ స్టార్స్ అంతా వెళ్లిన నేపథ్యంలో ఇప్పుడు నాగ్‌ వీడియోని వైరల్‌ చేస్తున్నారు. దీంతో పెద్ద రచ్చ రచ్చ అవుతుంది. వెళ్లిన సినిమా, క్రికెట్‌ సెలబ్రిటీలంతా డబ్బు తీసుకునే వెళ్లారా? అనే చర్చ ప్రారంభమైంది. ఎందుకంటే అంబానీతో మన  స్టార్స్ కి పెద్ద సంబంధాలేమీ లేవు. కేవలం డబ్బు కోసమే వాళ్లు వెళ్లి ఉండొచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కానీ ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. 

నాగార్జున చేసిన కామెంట్స్ లింక్‌
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories